‘నోటా’కు రిలీజ్ డేట్ ఫిక్స్..?

Updated By ManamFri, 09/07/2018 - 12:26
NOTA

NOTAసెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్ గురువారం విడుదలైంది. ఈ టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ విడుదలకు డేట్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అక్టోబర్ 4వ తేదిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారట. దసరా రోజుల్లో అటు తెలుగు, ఇటు తమిళ్‌లో గట్టి పోటీగా ఉండటం వలన ఈ సినిమాను ముందుగానే విడుదల చేయడం మంచిదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సాధారణ యువకుడిగా, ముఖ్యమంత్రిగా కనిపించనున్న విషయం తెలిసిందే.

English Title
Release date fix for Vijay Devarakonda's NOTA
Related News