నేడు ఏపీ సీఎంను కలవనున్న అంబానీ

Updated By ManamTue, 02/13/2018 - 12:50
Reliance Mukesh Ambani to meet CM Chandrababu | Today

Reliance Mukesh Ambani to meet CM Chandrababu | Todayఅమరావతి: ఏపీ సీఎం చంద్రబాబును రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కలవనున్నారు. మంగళవారం సాయంత్రం బాబుతో అంబానీ భేటీ కానున్నారు. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌‌తో పాటు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. విజయవాడ పర్యటనలో భాగంగా బాబుతో ఆయన భేటీ అవుతున్నారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ఏర్పాటుచేసిన ఆర్టీజీ సెంటర్‌ను అంబానీ పరిశీలించనున్నారు. అనంతరం సీఎం నివాసంలో విందు భేటీలోనూ ముఖేష్ పాల్గొనే అవకాశం ఉంది. 

ఇటీవల ముంబై పర్యటనలో భాగంగా ముకేష్ అంబానీని కలిసిన మంత్రి లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకుగల అవకాశాలు వివరించి రాష్ట్ర పర్యటనకు రావాలని ఆహ్వానించారు. దీనికి అనుగుణంగా అంబానీ.. సీఎంతో భేటీ కానున్నారు. వీరిమధ్య ఆయా అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉంది.

English Title
Reliance Mukesh Ambani to meet CM Chandrababu | Today
Related News