రైతులకు అండ‌గా... రేణూ

Updated By ManamFri, 08/10/2018 - 12:12
Renu Desai

Renu Desaiఈ మ‌ధ్య‌నే నిశ్చితార్థ వార్త‌ల‌తోనూ, ప‌వ‌న్ క‌ల్యాణ్ అడిగితేనే తాను డైవ‌ర్స్ ఇచ్చాన‌నే వార్త‌ల‌తోనూ మీడియాలోకెక్కిన రేణూదేశాయ్ తాజాగా రైతుల స‌మ‌స్య‌ల గురించి ఆలోచిస్తానంటూ వార్త‌ల్లో నిలుస్తున్నారు.  ఆమె తెలుగులో ఓ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌నే వార్త‌లు క్ర‌మంగా వెలువ‌డుతూనే ఉన్నాయి. తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం ఆమె సిద్ధం చేసుకున్న క‌థ రైతుల‌కు సంబంధించి. ఈ క‌థ పూర్తిగా రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉండాలంటే త‌ప్ప‌కుండా గ్రౌండ్ లెవ‌ల్‌కి వెళ్లి రైత‌న్న‌ల‌తో మాట్లాడాల్సిందే. ఇప్పుడు అదే ప‌ని చేస్తానంటున్నారు రేణూదేశాయ్‌. స్క్రిప్ట్ ప‌నులు దాదాపుగా పూర్తి కావ‌చ్చినా, నిజంగా గ్రౌండ్ లెవ‌ల్లో ఉన్న రైతుల వ‌ద్ద‌కెళ్లి మాట్లాడుతాన‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఆ ప్రోగ్రామ్‌ను మొద‌లుపెట్ట‌నున్న‌ట్టు తెలిపారు. 2019 ప్రారంభంలో ఈ సినిమాను మొద‌లుపెట్ట‌నున్న‌ట్టు, అంత‌లో వ్య‌క్తిగ‌త విష‌యాల‌న్నిటికీ ఓ కొలిక్కి తెచ్చుకోనున్న‌ట్టు ఆమె తెలిపారు. ఇంత‌కు ముందు మంగ‌ళాష్ట‌క్ సినిమాకు నిర్మాత‌గా, ఇష్క్ వాలా ల‌వ్ సినిమాకు ద‌ర్శ‌కురాలిగా రేణూకు అనుభ‌వం ఉన్న సంగ‌తి తెలిసిందే.

English Title
Renu Desai movie on farmers
Related News