అఖిలపక్షానికి వీడియోలు చూపండి..

Updated By ManamTue, 03/13/2018 - 19:24
revanth reddy

revanth reddyహైదరాబాద్: శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పై అసలు దాడి జరగనేలేదని, సీఎం కేసీఆర్ డ్రామాలో భాగంగానే ఇదంతానని కాంగ్రెస్ నేత రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. స్వామిగౌడ్ కంటికి దెబ్బతగిలిందంటున్నారని...అయితే ఆ వీడియోను చూపడం లేదన్నారు. అఖిలపక్షాన్నైనా పిలిపించి వీడియోలు చూపిస్తే నిజం బయటపడుతుందన్నారు. హరీశ్‌రావు కనుసైగతో లోపలికొచ్చిన మార్షల్స్‌.. కాంగ్రెస్‌ సభ్యులను కొట్టారని మండిపడ్డారు. ఇదంతా బీసీలను కాంగ్రెస్‌కు వ్యతిరేకం చేయాలన్న కేసీఆర్‌ పన్నాగమన్నారు. సీఎం ఆదేశాల మేరకే ఆస్పత్రిలో చేరానని స్వయంగా స్వామిగౌడే చెప్పడం ఈ డ్రామాలో కీలక అంశమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు, అబద్ధాల ప్రసంగాలు చదివే గవర్నర్‌కు ఇవే చిట్టచివరి అసెంబ్లీ సమావేశాలని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు గర్హనీయమని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రజాగ్రహానికి గురికాకతప్పదన్నారు.

 

English Title
Revanth reddy demands to show videos to all party
Related News