కేసీఆర్, కేటీఆర్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

Updated By ManamMon, 08/27/2018 - 17:05
Revanth reddy, KCR, KTR, TRS rule, Congress party, Pre-elections, EC

Revanth reddy, KCR, KTR, TRS rule, Congress party, Pre-elections, ECహైదరాబాద్: కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్న కేసీఆర్‌కు కొన్ని ప్రశ్నలు వేశామని చెప్పారు. తాము లేవనెత్తిన అంశాలకు తమకోసం కాదని, ప్రజల కోసం సమాధానం చెప్పాలన్నారు. మంత్రి కేటీఆర్ ముందస్తు ఎన్నికలు తీసుకురావడం వల్ల ఎవరికి లాభమని ప్రశ్నించారు. ప్రజలు తమ బాస్‌లు అయితే వారు 5ఏళ్ల కోసం ఓట్లేశారని గుర్తు చేశారు. అయితే నాలుగేళ్ల 4 నెలలకే ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారో వారికే సమాధానం చెప్పాలన్నారు. 

133 ఏళ్ల కాంగ్రెస్.. ఎన్ని ఎన్నికలు చూసింటుంది..
133 ఏళ్ల కాంగ్రెస్ ఎన్ని ఎన్నికలను చూసి ఉంటదని, తమకేం భయమని రేవంత్ చెప్పారు. ఇది టీఆర్ఎస్ అవగాహనా రాహిత్యమా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంగా.. ప్రజల పట్ల బాధ్యత ఉంది కాబట్టి తాము అడుగుతున్నామన్నారు. టీఆర్ఎస్ భయపడి ముందస్తుకు పోతున్నారని తాము అడుగుతున్నామని తెలిపారు. 4 జనవరి , 2019 లోపు సీఈఓ కొత్త ఓటర్ లిస్ట్ పెట్టాలని సూచించిందని చెప్పారు. ముందస్తు జరగాలంటే ఎన్నికల సంఘం ఇచ్చిన కార్యాచరణ మొత్తం పక్కన పెట్టి.. పాత లిస్ట్‌తో ఎన్నికలకు వెళ్ళాలని సవాల్ విసిరారు. ఈసీ ఆదేశాలను పక్కన పెట్టి.. ముందస్తు కోసం నరేంద్ర మోదీ ముందు కేసీఆర్ మొకరిల్లుతున్నారని విమర్శించారు. 

కేసీఆర్.. కేటీఆర్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు..
విభజన హామీల కోసం కేసీఆర్ ఎన్నడూ కేంద్ర మంత్రులను,  పీఎంలను కలవలేదనీ, కేటీఆర్, కేసీఆర్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సర్వేలలలో ఎక్కడ కేసీఆర్, కేటీఆర్ ఎక్కడా ఎమ్మెల్యేగా కూడా గెలుస్తారని రాలేదని ముందస్తుకు వెళ్తున్నారని మండిపడ్డారు. 89లో ఎన్టీఆర్, 2004లో చంద్రబాబుకు ముందస్తు ఫలితాలు ఎలా వచ్చాయో.. కేసీఆర్ పరిస్థితి కూడా అంతేనని అన్నారు. ఒక్కసారి ఎన్నికలు నెగ్గితే ఇంత అహంభావం అవసరమా? అని ప్రశ్నించారు.  సిరిసిల్లలో చెరొక దిక్కు నుంచి పోటీచేస్తే ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో చూద్దామని సవాల్ విసిరారు. పొత్తుల మీద పీసీసీ అధ్యక్షుడు సమాధానం చెబుతారన్నారు.

లక్ష్మణ్ కోరిక.. మంచి పరిణామం..
లక్ష్మణ్ కూడా రాహుల్ గాంధీ పీఎం కావాలని కోరుకోవడం మంచి పరిణామన్నారు. కేసీఆర్ రహస్య మిత్రుడు లక్ష్మణ్ మా మేలు కోరుకుంటారా? అని, రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేదని వారి రహస్య మిత్రుడు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.  కాంగ్రెస్‌లో లక్ష్మణ్ చేరాలనుకుంటే తాను మాట్లాడుతానని, ఎన్నికలు వేర్వేరు రావడం వల్ల .. ఆర్ధిక భారం, ఎన్నికల కోడ్ 8 నెలలు ఉండటం వల్ల అభివృద్ది కుంట పడుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు. 

English Title
Revanth reddy slams KCR, KTR, TRS rule
Related News