రెవెన్యూ వసూలు వివరాలలో లోటు

Updated By ManamMon, 05/28/2018 - 00:55
one tax

న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జి.ఎస్.టి)ని అమలులోకి తెచ్చిన 10 నెలల తర్వాత కూడా, ఏ రంగం లేదా ఏ వస్తువు నుంచి హెచ్చు రాబడి వస్తోందో, ఏది వెనుకబడిందో చెప్పలేని స్థితిలో పన్ను అధికారులు ఉన్నారు. ఈ అతి పెద్ద పన్ను సంస్కరణ కింద పన్ను అధికారుల వద్ద వస్తువు లేదా రంగం వారీగా పన్ను వసూలు వివరాలు లేకపోవడమే దానికి కారణం. దానితో  కేంద్ర పరోక్ష పన్నుల, కస్టమ్ బోర్డు అధికారులు జి.ఎస్.టి కింద  వస్తువు వారీగా వివరాలు రికార్డు చేసే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే ప్రాథమిక పనులను ప్రారంభించారు. ‘‘ఉదాహరణకు, సర్వీసుల రంగాన్నే తీసుకోండి. 2017 జూలై 1కి ముందు రెవిన్యూ రాబడులను రికార్డు చేయడానికి మాకు 250కి పైగా శీర్షికలు ఉండేవి. ఏ రంగం పనితీరు బాగుందో, ఏది బాగాలేదో మేం కనుగొనేవాళ్ళం. ప్రస్తుతానికి జి.ఎస్.టి కింద మా వద్ద అటువంటి ఎక్సెల్ షీట్ లేదు’’ అని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. డిపాజిట్ అయిన పన్ను వస్తువులా లేదా సేవల నుంచి వచ్చిందా అని చెప్పడం కూడా నిజంగా కష్టవేునని ఆ అధికారి అన్నారు. జి.ఎస్.టిని గత ఏడాది జూలై 1న ప్రవేశపెట్టారు. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన 17 పన్నులు, 23 సెస్సులను ఏకీకృతం చేసి జి.ఎస్.టిగా రూపొందించారు. వస్తువు వారీగా డాటా కొరవడడం వల్ల కొన్ని అననుకూలతలు ఉన్నాయని ఆ అధికారి అన్నారు. ‘‘ప్రోత్సాహకాలకు ప్రణాళిక తయారు చేయడానికి లేదా ఒక నిర్దిష్ట రంగానికి చేయూతనిచ్చి పెంపొందించేందుకు గతంలో పన్నుల వివరాలు, నిజంగా సహాయపడేవి. ప్రస్తుతానికి, అటువంటి పని చేయడం కష్టం’’ అని ఆ అధికారి తెలిపారు. 

taxవేర్వేరు కోడ్‌లు
జి.ఎస్.టి వ్యవస్థ కింద, ప్రతి వస్తువు లేదా వస్తువుల కేటగిరీకి, సర్వీసు లేదా సర్వీసుల కేటగిరీకి ఒక కోడ్ ఇచ్చారు. వస్తువులకు, హెచ్.ఎస్.ఎన్ లేదా హార్మైనెజ్డ్ సిస్టం ఆఫ్ నావెున్‌క్లేచర్ కోడ్ ఉంది. సర్వీసులకు సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ (ఎస్.ఎ.సి) ఉంది. ఈ రెండూ అంతర్జాతీయంగా ఆమోదం పొందినవి. అంతర్జాతీయ వర్తకంలో వాడుతున్నవి. టర్నోవరు లేదా తమ వ్యాపార స్వభావాన్ని ఆధారం చేసుకుని వర్తక, పరిశ్రమ వర్గాలవారు రెండు నుంచి ఎనిమిది సంఖ్యలు గల కోడ్‌ని ఉపయోగించవలసి ఉంటుంది. టర్నోవరు సుమారు రూ. 1.5 కోట్లకు ఎగువన, రూ. 5 కోట్లకు దిగువన ఉన్న పన్ను చెల్లింపుదార్లు రెండు సంఖ్యల కోడ్‌ను ఉపయోగించాలి. టర్నోవరు రూ. 5 కోట్లు, అంతకు ఎగువన ఉన్న పన్ను చెల్లింపుదార్లు నాలుగు సంఖ్యల కోడ్‌ను ఉపయోగించాలి. టర్నోవరు రూ. 1.5 కోట్లకు దిగువన ఉన్న పన్ను చెల్లింపుదార్లు వారి ఇన్‌వాయిస్‌లలో కోడ్‌ను పేర్కొనాల్సిన అవసరం లేదు. ఎగుమతి, దిగుమతుల వ్యాపారానికి ఎనిమిది సంఖ్యల కోడ్ ఉంటుంది. 
రిటర్నుల దాఖలు
వస్తువుల వారీగా వివరాలు రాకపోవడానికి కారణం ప్రస్తుత రిటర్నుల దాఖలు పద్ధతిలో ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత రిటర్నుల దాఖలు వ్యవస్థ (జి.ఎస్.టి.ఆర్-1, జి.ఎస్.టి.ఆర్-3బిలను దాఖలు చేయాల్సి ఉంటుంది) పన్ను వసూలు సమాచారాన్ని ఏకీకృత ప్రాతిపదికన సమకూరుస్తుంది. ‘‘జి.ఎస్.టి.ఆర్ 1, 3బిల రిటర్నుల ఫార్మాట్‌ల రూపు రేఖల కారణంగా, ప్రస్తుత రిటర్నుల దాఖలు వ్యవస్థ వస్తువు/హెచ్.ఎస్.ఎన్ వారీ ప్రాతిపదికన పన్ను వివరాలు అందించలేకపోతోంది’’ అని  డెలాయిట్ ఇండియాలో సీనియర్ డైరెక్టర్ సలోని రాయ్ వివరించారు. 

నేడు రెవెన్యూ వసూలు జి.ఎస్.టి.ఆర్ 3బి రిటర్ను ఆధారంగా ఉన్నందున పన్ను అధికారులు హెచ్.ఎస్.ఎన్ వారీగా రెవిన్యూ వసూలు వివరాలను ప్రాసెస్ చేయలేకపోతున్నారని ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా సంస్థలో ట్యాక్స్ పార్ట్నర్ బిపిన్ సప్రా అన్నారు. జి.ఎస్.టి.ఆర్ 3బి రిటర్నులో హెచ్.ఎస్.ఎన్ వారీగా రెవిన్యూ వివరాలు పొందుపరచాల్సిన అవసరం లేదు. కనుక, సమాకలనానికి అవి వెంటనే అందుబాటులో ఉండడం లేదు. జి.ఎస్.టి.ఆర్ 1లో వివరాలు ఉంటాయిగానీ, అవి జి.ఎస్.టి.ఆర్ 3బిలోని సంఖ్యలతో సరిపోలకపోవచ్చు. ఎందుకంటే, హెచ్.ఎస్.ఎన్ మాండేటరీ ఫీల్డ్ కాదు. ఈ డాటా సరైనదని ధ్రువీకరించే ఏర్పాటు ఏదీ లేదు. ‘‘జి.ఎస్.టి.ఆర్ 1 డాటా సమగ్ర విశ్లేషణతో  జి.ఎస్.టి.ఎన్ వెలువడితే, హెచ్.ఎస్.ఎన్ వారీ వివరాలు అందుబాటులోకి రావచ్చేమో. కానీ, జి.ఎస్.టి.ఆర్ 1లో క్యాష్ లేదా క్రెడిట్ ద్వారా జరిపిన వాస్తవిక పన్ను చెల్లింపు డాటా ఉండదు. ఎందుకంటే, హెచ్.ఎస్.ఎన్ వారీ జి.ఎస్.టి సదరు కంపెనీకి లయబిలిటీ అవుతుంది’’ అని సప్రా అన్నారు. కొత్త నెలవారీ రిటర్ను పత్రాన్ని ప్రవేశపెట్టిన తర్వా త, వస్తువుల వారీగా పన్ను వసూళ్ళను ప్రభుత్వం సేకరించగలదని సలోనా రాయ్ అన్నారు. అయితే, అది కొ త్త రిటర్ను ఫార్మాట్‌పై ఆధారపడి ఉంటుంది. నూతన నెలవారీ రిటర్ను ఫార్మాట్ ఈ ఏడాది చివరికి సిద్ధం కాగలదని భావిస్తున్నారు. 

English Title
Revenue Collection details in Deficit
Related News