ఆస్కార్ బరిలో ‘విలేజ్ రాక్‌స్టార్స్’

Updated By ManamSat, 09/22/2018 - 12:58
Villiage Rockstars

Villiage Rockstars2019లో జరగనున్న ఆస్కార్ అవార్డు ఉత్సవానికి ఎంపికలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా పలు దేశాల సినిమాలు ఆస్కార్ అవార్డుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకోవాలని తహతహలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ నుంచి అస్సామీ చిత్రం ‘విలేజ్ రాక్‌స్టార్స్’ బరిలో నిలిచింది. ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరిలో భారత్ నుంచి ‘విలేజ్ రాక్‌స్టార్స్’ చిత్రాన్ని ఎంపిక చేశారు జ్యూరీ సభ్యులు.

ఒక గ్రామానికి చెందిన ధను అనే పేద అమ్మాయి తన కలలను ఎలా నెరవేర్చుకుంది, తనకు ఎదురైన ప్రతి సమస్యను ఎలా పరిష్కరించుకునే అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి వివిధ కేటగిరిలలో ఈ ఏడాది నాలుగు జాతీయ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. కాగా టోరెంటో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ఈ చిత్రం ప్రదర్శింపబడిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని రీమా దాస్ తెరకెక్కించడంతో పాటు తానే నిర్మించగా ఆస్కార్‌ బరిలో ఈ చిత్రం నిలిచినందుకు గానూ ఆమె స్పందిస్తూ.. ‘‘గర్వంతో నా కళ్లు చమర్చుతున్నాయి. ఈ వార్తను నాకు ఆనందాన్ని కలిగించింది’’ అంటూ కామెంట్ పెట్టారు.

English Title
Rima Das Village Rockstars is India's official entry for Oscars
Related News