తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Updated By ManamWed, 08/01/2018 - 11:49
road accident

road accidentచెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోయంబత్తూరు సుందరాపురం సమీపంలో వేగంగా వచ్చిన లగ్జరీ కారు బస్టాండ్‌లోని జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు కాలేజీ విద్యార్థులు ఉన్నారు. గాయపడ్డవారిని కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.

English Title
Road Accident in Tamilnadu, 7 killed
Related News