ట్రావెల్ బస్సు బోల్తా.. వైజాగ్‌లో రోడ్డు ప్రమాదం

Updated By ManamWed, 02/21/2018 - 07:27
bus

Busవిశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్ఏడీ జంక్షన్‌లో వెళ్తున్న ట్రావెల్ బస్సు రోడ్డు దాటుతున్న లారీని ఢీ కొట్టి, బోల్తా కొట్టింది. ఆ బస్సులో 50మంది ప్రయాణికులు ఉండగా.. వారందరికీ గాయాలయ్యాయి. వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

English Title
Road accident in Vizag
Related News