రోహిత్, ధోనీ ఔట్.. పాండ్యా డకౌట్

Updated By ManamTue, 02/13/2018 - 20:04
rohit

rohit sharmaపోర్ట్‌ఎలిజిబెత్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో రోహిత్ శర్మ ఔటయ్యాడు. సెంచరీ చేసిన తర్వాత దూకుడుగా ఆడుతున్న రోహిత్‌ను లుంగీ ఎన్‌గిడీ పెవిలియన్‌కు పంపాడు. లుంగీ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్‌గా చిక్కి రోహిత్ ఔటయ్యాడు. రోహిత్ తర్వాత హార్థిక్ పాండ్యా కూడా లుంగీ ఎన్‌గిడీ బౌలింగ్‌లోనే డకౌట్ అయ్యాడు. ధోనీ కూడా లుంగీ బౌలింగ్‌లో మార్‌క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఔటయ్యే సమయానికి రోహిత్ శర్మ(115), పాండ్యా(0), ధోనీ(13) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో లుంగీ ఎన్‌గిడీ ఇప్పటివరకూ 4వికెట్లు తీసి సత్తా చాటాడు.

English Title
rohit sharma out
Related News