లక్ష్మీపార్వతి పాత్రలో..

Updated By ManamWed, 10/24/2018 - 06:24
sri reddy

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని మూడు బయోపిక్స్ రూపొందుతున్నాయి. అందులో ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ ‘యన్.టి.ఆర్’ను నిర్మిస్తున్నారు. ఈ బయోపిక్ ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’, ‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ అని రెండు భాగాలుగా విడుదలవుతుంది. కాగా.. రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తెరకెక్కించడానికి రెడీ అయ్యారు.

image


ఈ రెండు బయోపిక్స్‌తో పాటు దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా లక్ష్మీ పార్వతి పాత్రలో శ్రీరెడ్డిని నటింప చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. శ్రీరెడ్డి కూడా సానుకూలంగానే స్పందించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక సమాచారం వెలువడనుంది. 

English Title
In the role of Lakshmi Parvati
Related News