‘ఖని’లో రౌడీమూకలు

Updated By ManamFri, 06/22/2018 - 02:16
image
  • కోల్‌బెల్ట్ ఏరియాలో రౌడీ షీటర్ల ఆగడాలు.. ఒంటరి మహిళలు, బాటసారులపై దాడులు 

  • బెదిరింపులు, బలవంతపు వసూళ్లు.. హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన ప్రజలు

imageకరీంనగర్: కోల్‌బెల్ట్ ఏరియాలోని పలు ప్రాంతాల్లో రౌడీ మూకల ఆగడాలు అధికమయ్యాయి. జల్సాలకు అలవాటుపడిన కొందరు రౌడీలు ఒంటిరి మహిళలను వేధించడం, ఒంటరిగా వస్తున్న వారిని ఆపి బెదిరించి డబ్బు వసూలు చేయడం వంటి పనులుకు పాల్పడుతున్నారు. కోల్‌బెల్ట్‌లోని పారిశ్రామిక ప్రాంతాైలెన రామగుండం, గోదావరిఖని,  మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

మాస్ ఏరియాగా పేరున్న గోదావరిఖనిలోని శివారు ప్రాంతాల్లో  కొందరు రౌడీలు కొంత కాలంగా దాడులకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కాలనీల్లో నివాసం ఉంటున్న ఒంటరి మహిళలను గుర్తించి వారిపై వేధింపులకు పాల్పడుతున్నారని సమాచారం. రౌడీ షీటర్ల తమపై దాడి చేశారంటూ ఇప్పటికే చాలామంది పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండడంతో పోలీసులు నిఘా పెంచారు. రౌడీల ఆటకట్టించేందుకు అదును కోసం ఎదురుచూస్తున్నారు.

గోదావరిఖని మున్సిపల్ కార్ఫోరేషన్ పరిధిలోని శివారు కాలనీలు, వాడల్లో  అసాంఘిక కార్యకలాపాలకు  పాల్పడుతున్న రౌడీషీటర్ల వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. జీఎం కాలనీ ప్రాంతం లో  వారం క్రితం  కొందరు  రౌడీషీటర్లు కాలనీలోని ఒక మహిళపై దాడి చేసినట్లు సమాచారం.. ఆదే కాలనీలో ఒంటరిగా వెళుతున్న బాటసారులపై దాడులకు పాల్పడడం.. అందినంత దండుకోవడం  పరిపాటిగా మారింది. పోలీసులు నుంచి సరైన స్పందన లేకపోవడంతో పలువురు రౌడీల ఆగడాలపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు చేశారని విశ్వసనీయ సమాచారం.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం
రామగుండం సీపీ విక్రంజిత్ దుగ్గల్
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని రామగుండం పోలీసు కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్ సిబ్బందికి సూచించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే వారిపై పీడీ యాక్టు కింద కేసులు పెట్టాలని, నిత్యం ఆకతాయి పనులకు పాల్పడే వారిపై రౌడీషీట్ తెరవాలని ఆదేశించారు. సీసీ కెవెురాలు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించాలన్నారు. ప్రజా భద్రత పోలీసుల బాధ్యత అని తెలిపారు. 
త్వరలో పంచాయతీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.

ఉపయోగపడనిసీసీ కెవెురాలు
imageనేర నియంత్రణ కోసం పోలీసు శాఖ అన్ని ప్రాంతాల్లో సీసీ కెవెురాలను ఏర్పాటు చేయిస్తుంది. పోలీసు శాఖ ఆదేశాల మేరకు ప్రజలు, వ్యాపారులు తమ తమ ప్రాంతాల్లో సీసీ కెవెురాలు ఏర్పాటు చేసుకున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, కాలనీలతో పాటు దాదాపు అన్ని ప్రాంతాల్లోను సీసీ కెమెరా నిఘా ఉన్న ఆకతాయి రెచ్చిపోవడం గమనార్హం.

English Title
roudees
Related News