హెచ్‌ఎఫ్‌సీఎల్‌కు రూ.611 కోట్ల ఆర్డరు

Updated By ManamSun, 09/23/2018 - 22:42
hfcl

hfclన్యూఢిలీ: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బాండ్  నుంచి రూ. 611 కోట్ల విలువైన ఆర్డర్లు పొంది నట్లు టెలికాం పరికరాల తయారీ సంస్థ హెచ్ ఎఫ్‌సీఎల్ ఇటీవల వెల్ల డించింది. మధ్య ప్రదేశ్‌లో బ్రాడ్‌బాండ్ అనుసంధానానికి ముందస్తు ఆర్డరును పొందినట్లు తెలిపింది. ఈ ఆర్డరులో ఆప్టికల్ ఫైబర్ సర్వే, కొనుగోలు, పంపిణీ, కంచె, కేబుల్స్ వేయడం, స్థాపన, పరిక్షించడం, నిర్వహణ వంటి అంశాలున్నట్లు హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్(హెచ్‌ఎఫ్‌సీఎల్) తెలిపింది. మొత్తం సామాగ్రికి రూ. 207 కోట్లు, సర్వేకు రూ. 245 కోట్లు కేటాయించినట్లు కంపెనీ  పేర్కొంది. మొత్తం ఏడేళ్ల పాటు నిర్వహణకు రూ. 59 కోట్లతో ఒప్పందం కుదిరినట్లు హెచ్‌పీసీఎల్ తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా మధ్య ప్రదేశ్‌లోని 13 బ్లాకుల్లో 1,038 గ్రామ పంచాయితీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కలగనుందని హెఎఫ్‌సీఎల్ వెల్లడించింది.

Tags
English Title
Rs 611 crore order from HFCL
Related News