ఆర్‌కాం చేతికి రూ.18 వేల కోట్లు

Updated By ManamSun, 03/11/2018 - 23:56
relance

relance jioముంబయి: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ఆస్తులు విక్రయిస్తున్న లావాదేవీలో మొదటి విడత కింద రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కాం) సుమారు రూ. 18,000 కోట్లను అందుకోనుంది. రుణాల ఊబిలో కూరుకుపోయిన ఆర్‌కాం ప్రతిపాదిత ఆస్తుల విక్రయానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సి.సి.ఐ) ఆమోదం తెలిపింది. అనిల్ అంబానీ నియంత్రణలోని ఆర్‌కాం రెండవ విడత కింద సుమారు రూ. 6,000 కోట్లు పొందవచ్చు. మొదటి దశలో ఆర్‌కాం టవర్లు, ఇండియా ఫైబర్, టెలికాం మౌలిక వసతులు, 850 మెగాహెర్ట్జ్, 900 మెగాహెర్జ్ట్ , 1800 మెగాహెర్జ్ట్ , 2100 మెగాహెర్జ్ట్‌లలో స్పెక్ట్రమ్‌ను ఇవ్వజూపుతోందని ఈ పరిణామాన్ని సన్నిహితంగా పరిశీలిస్తున్న వర్గాలవారు తెలిపారు. రెండవ విడతలో అది అఖిల భారత 850 మెగాహెర్జ్ట్, 1800 మెగాహెర్జ్ట్‌లను దత్తం చేస్తుందని ఆ వర్గాలవారు తెలిపారు. ప్రతిపాదిత ఆస్తుల అమ్మకానికి సి.సి.ఐ ఆమోదాలను కూడా ఆర్‌కాం సంపాదించింది. రిలయన్స్ జియోకి ఆస్తులు విక్రయించడానికి వీలు లేకుండా ఒక ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ మాత్రం ఆంక్షలు విధించింది. ‘‘రిలయన్స్ జియోకి ఆర్‌కాం ఆస్తుల అమ్మకానికి సంబంధించిన ప్రతిపాదనలన్నింటికీ సి.సి.ఐ ఆమోదం తెలిపింది. ఆమోద ముద్రపడిన ప్రతిపాదనల్లో ఆర్‌కాం టవర్లు, ఇండియా ఫైబర్ స్పెక్ట్రమ్, టెలికాం మౌలిక వసతులు కూడా ఉన్నాయి’’ అని విశ్వసనీయ వర్గాలవారు తెలిపారు. ఈ నెలాఖరునాటికే ఈ అమ్మకం తతంగం పూర్తవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్‌లో ఎరిక్‌సన్ దాఖలు చేసిన కేసు తుది ఫలితైంపె ఈ లావాదేవీ ఆధారపడి ఉండవచ్చు. ఆర్‌కాం, దానికి చెందిన రెండు యూనిట్లు తన అనుమతి లేకుండా ఏ రకమైన ఆస్తులను బదలీ చేయుడంగానీ, అమ్మడంగానీ చేయుకూడదని ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ చర్యతో  మొత్తం ఆస్తుల అమ్మకం ప్రక్రియ జాప్యమయ్యే అవకాశం ఉంది. టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్‌సన్ చేసిన అభ్యర్థన మేరకు మార్చి 5న ఆ తాత్కాలిక ఆదేశం జారీ అయింది. ఆర్‌కాం సంస్థకి చెందిన దేశవ్యాప్త నెట్‌వర్క్‌ను ఆపరేట్ చేసి, మేనేజ్ చేసేందుకు 2014లో 
ఏడేళ్ళ ఒప్పందంపై స్వీడిష్ సంస్థ ఎరిక్‌సన్ సంతకాలు చేసింది. ఆర్‌కాం తనకు బకాయిలు చెల్లించవలసి 
ఉందని ఎరిక్‌సన్ చెబుతోంది. ‘‘ఈ తాత్కాలిక ఆదేశానికి వ్యతిరేకంగా మేం ముంబయి హైకోర్టులో అప్పీలు 
దాఖలు చేయాలనుకుంటున్నాం. అన్‌సెక్యూర్డ్ ఆపరేషనల్ విక్రేత అయిన ఎరిక్‌సన్‌తో పోలిస్తే, సెక్యూర్డ్ ఫైనాన్షియల్ రుణ దాతల క్లైములకే అధిక ప్రాధాన్యం లభిస్తుంది. 
పైగా, సెక్యూర్డ్ ఫైనాన్షియల్ రుణ దాతల నిర్ణయాల 
మేరకే ఆస్తుల అమ్మకాన్ని చేపట్టడం జరిగింది’’ అని ఆర్‌కాం ప్రతినిధి ఒకరు చెప్పారు.

Tags
English Title
Rs.18,000 crores for Arkham
Related News