కొత్త కనిష్ఠ స్థితికి కుంగిన రూపాయి

Updated By ManamTue, 09/11/2018 - 22:21
rupee-falling

rupee-falling_ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం కొనసాగి మంగళవారం అది సరికొత్త కనిష్ఠ స్థాయి రూ. 72.73కు పడిపోయింది. మధ్యాహ్న ట్రేడ్‌లో అది 28 పైసలు క్షీణించింది. ముడి చమురు ధర పీపాకు 78 డాలర్లు మించడంతో అమెరికన్ కరెన్సీ మరింత పటిష్టపడింది. విదేశీ ఫండ్లు స్టాక్ మార్కెట్ల నుంచి మదుపు మొత్తాలను ఉపసంహరించుకోవడం నిర్విరామంగా సాగుతోంది. బి.ఎస్.ఇ ‘సెన్సెక్స్’ మంగళవారం 500 పాయింట్లకు పైగా పతనమవడం కూడా దేశీయ కరెన్సీని కుంగదీసింది. బ్యాంకులు, ఎగుమతిదార్ల నుంచి పెరిగిన అమ్మకాలతో డాలర్‌తో మారకంలో రూపాయి మంగళవారం ఉదయం 20 పైసలు పుంజుకుని రూ. 72.25 వద్ద సానుకూల ధోరణిలోనే మొదలైంది. కానీ, అది ఆ గతిని నిలబెట్టుకోలేక మరో 28 పైసలు క్షీణించి రూ. 72.73కు పడిపోయింది. సోమవారంనాడది రూ. 72.67 కనిష్ఠ స్థాయిని చూసింది. 

Tags
English Title
The rupee depreciated to a new minimum
Related News