విలవిలలాడుతున్న రూపాయి

Updated By ManamMon, 09/10/2018 - 12:26
Rupee Dives To New Lifetime Low Of 72.48 Against US Dollar
Rupee Dives To New Lifetime Low Of 72.48 Against US Dollar

న్యూఢిల్లీ : రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనం అయింది. రూపాయి రోజు రోజుకు బక్కచిక్కుతూ డాలర్ ఎదుట సాగిలపడుతోంది. ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం రేటు సోమవారం సరికొత్త కనిష్ఠ స్థాయి రూ. 72.44కి పడిపోయింది. ట్రేడింగ్ ఆరంభంలోనే మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి 64 పైసల నష్టంతో 72.37 స్థాయికి చేరింది.

ఓవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల, మరోవైపు  రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ ఆవేశకావేషాల ప్రకటనలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ సెంటిమెంట్లను మరింత దెబ్బతీశాయి.

అలాగే ప్రపంచ అనిశ్చిత పరిస్థితులు, ద్రవ్యోల్బణంపై ఆందోళనలతో రూపాయి విలువ క్షీణిస్తున్న గతిలో ఉంది. మరోవైపు రూపాయి పతనంతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగానే సెన్సెక్స్‌ 233 పాయింట్లు, నిఫ్టీ 73 పాయింట్లు క్షీణించాయి.

English Title
Rupee Dives To New Lifetime Low Of 72.48 Against US Dollar
Related News