రూపాయి బలపడొచ్చు

Updated By ManamWed, 08/22/2018 - 22:14
rupee

rupeeన్యూఢిల్లీ: కొంతకాలంగా తీవ్రంగా దెబ్బతింటూ వస్తున్న రూపాయి ఆసియాలోని చాలా భాగం ప్రవర్థమాన మార్కెట్లు కనబరుస్తున్న రిలీఫ్ ర్యాలీ, దేశంలోకి తరలి వస్తున్న సానుకూలంగా ఉన్న పెట్టుబడుల ప్రవాహాల పుణ్యమా అని విలువను పెంచుకోవచ్చని నిపుణులు చెబు తున్నారు. టర్కిష్ సంక్షోభం మధ్యలో అమెరికన్ డాలర్‌కు పటిష్టమైన డిమాండ్ రావ డంతో, ఆగస్టు 16న దాని తో రూపాయి మారకం విలువ మొదటిసారిగా రూ. 70కి కొద్ది దిగువన ముగిసింది. ప్రపంచ అనిశ్చి త పరిస్థితులు, ద్రవ్యోల్బణంపై ఆందోళనలతో రూపాయి విలువ క్షీణిస్తున్న గతిలో ఉంది. కానీ, కడచిన కొద్ది రోజులుగా అది తిరిగి కొంత కోలుకున్నట్లు కనిపిస్తోంది. ‘‘అమెరికా-చైనా మధ్య తాజా వాణిజ్య చర్చలు మొదలవడం, టర్కిష్ సంక్షోభం సడలిపోవడంతో ఏషియాలోని చాలా ప్రవర్థమాన మార్కెట్ల కరెన్సీలలో ఊరటతో కూడిన ర్యాలీ కనిపిస్తోంది. వాటిననుసరించి భారతీయ రూపాయి విలువ కూడా పెరుగుతోంది’’ అని ఎపిక్ రిసెర్చ్ సి.ఇ.ఓ ముస్తఫా నదీమ్ అన్నారు. అమెరికన్ డాలర్‌పై బేరిష్ పందాలు పెరగడంతో రూపాయి మారకం విలువ అర శాతంపైగా వృద్ధి చెందింది. ప్రస్తుతం రూ. 70.2గా ఉన్న రూపాయి మారకం విలువ బలపడి రూ. 69.4 లేదా రూ. 69.5కి తగ్గవచ్చని ఆయన చెప్పారు. ఈ నెలలో దేశంలోకి ప్రవహిస్తున్న పెట్టుబడుల ప్రవాహాలను ఆధారం చేసుకుని డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 68 లేదా రూ. 69 వద్ద స్థిరపడవచ్చని భావిస్తున్న ట్లు ఆర్థిక వ్యవ హారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ కూడా చెప్పారు. రష్యా, బ్రెజిల్, అర్జెంటీనా, టర్కీ కరెన్సీలతో పోలిస్తే, రూపాయి మారకం విలువ బాగానే ఉందని హెచ్.ఎస్.బి.సి గ్లోబల్ అసెట్ మేనేజ్‌మెంట్ (ఇండియా) చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అధికారి తుషార్ ప్రధాన్ కూడా ఇటీవల అన్నారు. రూపాయి మారకం విలువ తరగుదలకి అంతర్గత బలహీనత దేనికన్నా కూడా డాలర్ పటిష్టమవడమే చాలావరకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయి మారకం విలువ తిరిగి దాని సహజ స్థితికి చేరుకుంటోందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కూడా అన్నారు.

Tags
English Title
The rupee will be strengthened
Related News