రూపిందర్, సునీల్ దూరం

Updated By ManamFri, 11/09/2018 - 02:48
hockey
  • హాకీ వరల్డ్‌కప్‌కు భారత్ జట్టు ఎంపిక

hockeyన్యూఢిల్లీ: ఈ నెల 28 నుంచి భువనేశ్వర్‌లో జరగబోయే హాకీ వరల్డ్ కప్‌కు భారత్ పురుషుల హాకీ జట్టుని గురువారం ప్రకటించింది. మొత్తం 18 మంది సభ్యులతో కూడిన భారత పురుషుల హాకీ జట్టుకు మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు. కానీ ఈ టోర్నీకి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రూపిందర్‌పాల్ సింగ్, ఎస్‌వీ సునీల్ దూరమయ్యారు. అక్టోబర్‌లో మస్కట్‌లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో సునీల్‌కు మోకాలి గాయం అయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా భారత్ జట్టు తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. పిఆర్ శ్రీజేష్, కృష్ణ బహుదూర్ గోల్ కీపర్‌లుగా ఎంపికవ్వగా... సింగ్ కంగూజమ్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. మస్కట్‌లో ఆసియా చాంపియన్స్ ట్రోఫీని మిస్ అయిన బిరేంద్ర లక్రా శస్త్ర చికి త్స అనంతరం జట్టులో చోటు సంపాదించగా... వరుణ్ కుమార్, కొత్తజిత్ సింగ్, సురేందర్ కుమార్, అమిత్ రోహి దాస్ డిఫెండర్‌లుగా వ్యవహరించనున్నారు. మన్‌ప్రీత్ సింగ్, సింగ్, నీలకంఠ శర్మ,హర్దిక్ సింగ్, సుమీత్‌లతో మిడ్‌ఫీల్డింగ్ బలంగా ఉంది. ఆకాష్‌దీప్, మన్‌దీప్ సింగ్, దీల్‌ప్రీత్, లలిత్ కుమార్, సిమ్రాన్‌జిత్‌లు ఫార్వార్డ్ లుగా తమ బాధ్యత ను నిర్వహించనున్నారు. ‘ వరల్డ్ కప్‌కు మేము ఉత్తమమైన అందుబాటులో ఉన్న ఆటగాళ్లని ఎంపిక చేశాం. 34 మంది ప్లేయర్స్‌తో ఉన్న భారత్ పూల్ నుంచి 18 మందిని ఎంపికచేయటం చాలా కష్టంగా అనిపించింది. ఈ టీమ్‌లో అనుభవజ్ఞులైన, యువ క్రీడాకారులను వారి ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేశాం’ అని కోచ్ హరిందర్ సింగ్ తెలిపారు.

Tags
English Title
Rupinder and Sunil distance
Related News