అమెరికా ఎన్నికల్లో  మళ్లీ రష్యా జోక్యం

Updated By ManamTue, 01/30/2018 - 22:15
amerikaelactions

హెచ్చరించిన అమెరికా నిఘా విభాగం
amerikaelactionsవాషింగ్టన్:  వాషింగ్టన్ వ్యవహారాల్లో మాస్కో తలదూర్చడం మానకపోగా, రానున్న ఎన్నికల్లో కూడా జోక్యం చేసుకోనే అవకాశమున్నట్టు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ మైక్ పాంప్యో తాజాగా వెల్లడించారు. బీబీసీ రష్యా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘ఈ విషయంలో రష్యా విధానంలో ఎటువంటి మార్పు రాలేద’ని మైక్ అభిప్రాయపడ్డారు. ‘ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తూనే ఉంటుంది, రష్యా ఎంత ప్రయత్నించినా రానున్న ఎన్నికలు నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా జరుగుతాయన్న విశ్వాసం నాకుంది, వారు పెద్దగా ప్రభావం చూపరని నాకనిపిస్తోంది’ అంటూ మైక్ పేర్కొన్నారు.  హిల్లరీ క్లింటన్ కాకుండా డొనాల్డ్ ట్రంప్ గెలుపొందేలా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపాలని  రష్యా నిఘా విభాగాన్ని, ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారని, అమెరికా నిఘా విభాగం 2016లో వెల్లడించింది. హిల్లరీ ప్రచార వ్యూహాన్ని హ్యాకింగ్ చేయడం, 
ఇంటర్‌నెట్‌లో ఆమెకు సంబంధించిన కీలక ఈమెయిల్స్, డాక్యుమెంట్లు పోస్ట్ చేయడం వంటివన్నీ ఇందులో భాగంగానే చోటుచేసుకున్నాయి. మరోవైపు తనకు మాస్కో సహకరించిందనే ఆరోపణలను ట్రంప్ కొట్టిపారేయడం, ఇవన్నీ తప్పుడు వార్తలని పదేపదే పేర్కొనడం జరిగింది.
2018లో జరుగనున్న ఎన్నికల్లో మైనారిటీ డెమాక్రాట్లు, రిపబ్లికన్స్‌పై పైచేయి సాధించేందుకు కుస్తీ పడనున్నారు.

English Title
Russia intervenes again in the US election
Related News