భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోనున్న రష్యా..!

Updated By ManamFri, 08/03/2018 - 10:34
elections

elections 2016లో జరిగిన అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనే ఆరోపణలు అప్పట్లో సంచలనం కాగా.. 2017లో అమెరికా ఇంటిలిజెన్స్‌ అధికారి వీటికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు.కాగా త్వరలో జరగనున్న భారత్‌, బ్రెజిల్‌ దేశాల ఎన్నికల్లోనూ ఆ దేశం జోక్యం చేసుకోనుందనే రిపోర్టు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 

ఇరు దేశాల్లోని మీడియాను టార్గెట్‌ చేయడం ద్వారా ఈ ఎన్నికలను రష్యా ప్రభావితం చేయబోతోందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిపుణుడు ఫిలిప్‌ ఎన్‌. హోవర్డ్‌ అమెరికా చట్టసభలకు వెల్లడించారు. భారత్‌, బ్రెజిల్‌లలో మీడియా ప్రొఫెషనల్‌గా ఉండదని, దీని వల్ల రష్యా వారిపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఫిలిప్‌ వ్యాఖ్యానించారు. ఇందుకు హంగేరి మీడియా ఉదంతాన్ని ఉదహరించారు.

English Title
Russia will involve in India elections
Related News