రష్యన్ సాహిత్య సామ్రాజ్ఞి అన్నా అక్‌మతోవ

Updated By ManamMon, 02/12/2018 - 02:39
anna akhmatova

Anna Akhmatovaఇరవయ్యవ శతాబ్దపు రష్యన్ సాహిత్యంలో అన్నా అక్‌మతోవ తిరుగులేని కవియిత్రిగానే కాదు, స్టాలిన్ నియంతృత్వాన్ని ఎదిరించిన పోరాటంలో తిరుగులేని శక్తిగా కూడా చరిత్రలో తనకంటూ ఓ స్థానం దక్కించుకుంది. స్టాలిన్ పాలనలో చాలా మంది రచయితలు ప్రవాహంలోకి వెళ్ళటం తటస్థిచింది. అక్‌మతోవతో సన్నిహితంగా వుండే మదుకోవ స్కీ  ఏప్రిల్ 1930లో ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ఎస్‌నిన్, మేరినా స్వేతయేవ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. అక్‌మతోవ మొదటి భర్త నికొలయ్ గుమిల్యోవ్ స్వ యాన కవికూడా. అతనిని బోల్షివిక్ పార్టీకి వ్యతిరేకంగా కుట్ర పన్నాడనే నెపంతో 1921లో విచారించి ఆగష్ట్ 25న అతనితోపాటు 61 మందిని కాల్చిచంపారు. ఈ సంఘటన లతో రష్యన్ మేధావులు, కళాకారులు సహా అక్‌మతోవ కూడా ప్రభుత్వ నిఘాలో కాలం గడిపింది. ఆమె కుమారుడు లెవ్ గుమిలెవ్‌ని పై చదువులు చదువుకోటానికి ప్రభు త్వం అనుమతించలేదు. చివరికి అతనిని అరెస్ట్ చేస్తారు కూడా! అక్‌మతోవ కవిత్వాన్ని బూర్జువా సాహిత్యంగా పరిగణించి 1925 ప్రాంతంలో ఆ రచనలు ప్రచురించకుండా అడుకున్నారు. అయినా ఆమె కవిత్వాన్ని రాయటం ఆపలేదు. దాంతోపాటుగా విక్టర్ హ్యూగో, రబింద్రనాథ్ టాగోర్, లియో పార్టీల రచనలు అనువాదం చేసింది. పుష్కిన్, డోన్తీవస్కీ  రచనలపై పరిశోధనలు చేసింది. విమర్శకురాలిగా, సమిక్షకురాలిగా వ్యాసాలు రాసింది. ఆమె చా లా రచనలు ఆ కాలంలో వెలుగులోకి రాకపోవటంతో రష్యాలోని, బైట ప్రపంచంలోని విమర్శకులు, పాఠకులు ఆమె చనిపోయిందని భావించారు. 
నిజానికి అక్‌మతోవ తన 11వ యేట నించే కవిత్వం రాయసాగింది. కాని అవేవీ లభ్యం కాలేదు. పుష్కిన్, నికోలయ్ న్రెకసోవ్‌తో పాటు సింబాలిక్ కవులను అభిమానించేది. కాని ఆమె 1910కి అనుకూలంగా కవిత్వం రాసింది. గిల్డ్ ఆఫ్ కవులు 1912లో వెచర్book కవిత్వ సంపుటిని ప్రచురించారు. ఆ పుస్తకంతో అన్నా అక్‌మతోవ మంచి పేరు తెచ్చుకుంది. ఆమె రెండవ సంపుటి బీడ్స్‌తో సాహిత్యంలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. డాక్టర్ ఝువాగో రచయిత బోరిస్ పాస్టర్ నాక్ వివాహితుైడెనప్పటికీ ఆమె సౌందర్య ఆకర్షణకి లోనై ఆమెని పెళ్ళి చేసుకోటానికి ఉద్యక్తుడవుతాడు. ఈలోగా ప్రముఖ గేయ రచయిత అలెగ్జాండర్ బ్లాక్‌తో ఆమెకి సంబంధం వుందని పుకార్లు షికారు చేశాయి. అక్‌మతోవ స్వేచ్ఛా ప్రియత్వం ఎక్కువగా యిష్టపడేది. కానీ, ఫిబ్రవరి 1917 విప్లవ ప్రారంభంతో చాలామంది ఆమె సన్నిహితులు దేశం విడిచిపోయినా, ఆమె మాత్రం రష్యా నుంచి పారిపోవటానికి ఇష్టపడలేదు. 1925 ప్రాంతంలో ఆమె అరెస్ట్ నుంచి తప్పించుకోగలిగింది. కాని తన కుమారుడిని జైలు నుంచి విడిపించుకోటానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. అక్‌మతోవ సహచరుడు నికోలోయ్ పునిన్‌ని కూడా అరెస్ట్ చేశారు. అతను 1953లో గులాగ్ జైలులో మరణించాడు.

స్టాలిన్ 1939లో ఆమె ఆరు కవిత్వా సంపుటాలలోన్నుంచి ఒక పుస్తకాన్ని ప్రచురించటానికి అనుమతి యిచ్చినా, అనంతరం ఆ పుస్తకాన్ని మార్కెట్ నుంచి వెనక్కి తీయించి ధ్వంసం చేశారు. అక్‌మతోవ తన కవిత్వాన్ని రాసి, అనంతరం ఆ కాగితాన్ని తగలబెట్టాల్సిన పరిస్థితులు దాపురించాయి. ప్రజల కష్టాలను, నియంతృత్వాన్ని నిలదీస్తా రాసిన ఎలిజీ కవిత్వం రెక్వియమ్ రష్యాలో 1987కి గాని ప్రచురణకు నోచుకోలేదు. ఎ పోయం విత్ అవుట్ ఎ హీరో ఆమెకి గొప్ప పేరు తెచ్చింది. రెక్వియమ్ ఈరోజుకీ రష్యాలో గొప్ప పుస్తకంగా ప్రజలు గౌరవిస్తారు. 1966లో ఆమె గుండె పోటుతో మరణించింది. ఆమె సమాధి కొమరోవ్‌లో ఇప్పటికీ ఓ దర్శనీయ స్థలం.... రెక్వియంలో నుంచి కొన్ని చరణాలు... నాకు చాలా పని వుంది చేయటానికి ఈ దినాన / నా జ్ఞాపకాలను చంపుకోవాల్సిన అవసరం ఎంతో వుంది / నా బతికివున్న ఆత్మని రాయి చేసుకోవాల / అప్పుడు నాకు నేర్పుకోవాల తిరిగి బతికేలా.
- సాగర్ శ్రీరామ కవచం
98854 73934  

English Title
Russian literary empress Anna Akhmatova
Related News