భారత్ చేరుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు

Updated By ManamSun, 07/08/2018 - 19:10
S. Korean president, India for state visit, PM Narendra modi
  • సతి సమేతంగా భారత్‌లో నాలుగు రోజుల పర్యటన

S. Korean president, India for state visit, PM Narendra modiన్యూఢిల్లీ: దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ ఆదివారం సాయంత్రం భారత్‌ చేరుకున్నారు. ఆయనకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వి.కె.సింగ్‌ ఘనస్వాగతం పలికారు. అధ్యక్షుడు మూన్‌ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 8 నుంచి 11వరకు భారత్‌లో పర్యటించనున్నారు. మూన్ వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు. రెండు దేశాల పర్యటనలో భాగంగా ముందుగా మూన్‌ భారత్‌లో పర్యటించి అనంతరం సింగపూర్‌లో పర్యటించనున్నారు. 2017లో దక్షిణ కొరియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి అధ్యక్షుడి హోదాలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై, ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించనున్నారు. ఇరుదేశాల మధ్య సత్సాంబంధాలను పెంపొందించేందుకు ఈ చర్చలు ప్రాధాన్యాన్ని సంతరించుకోనున్నాయి.

ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు మూన్ భారత్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో మూన్-మోదీ మంగళవారం భేటీ కానున్నారు. దీంతో గత ఏడాది జర్మనీలో జరిగిన గ్రూపు 20 సదస్సు తరువాత రెండోసారి ఈ తరహాలో దేశాధినేతల మధ్య జరిగే తొలి సమావేశం కానుంది. తద్వారా ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని అభివృద్ధి చేసే దిశగా ఇరు దేశాల నేతల మధ్య చర్చలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల భారత్ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు మూన్.. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కొత్త ఉత్పత్తి సౌకర్యాలను సందర్శించనున్నట్టు కొరియన్ అధ్యక్ష కార్యాలయం చియాంగ్ వా డేయి పేర్కొంది. అలాగే రాష్ట్రపతి రామ్‌‌నాధ్ కోవింద్‌తో కూడా మూన్ సమావేశం కానున్నారు. అనంతరం ఇద్దరు కలిసి జాయింట్ బిజినెస్ ఫౌరంలో పాల్గొనున్నారు. కాగా, అధ్యక్షుడు బుధవారం భారత్‌ నుంచి బయల్దేరి మూడు రోజుల పర్యటనలో భాగంగా సింగ్‌పూర్‌లో పర్యటించనున్నారు. 

English Title
S. Korean president arrives in India for state visit
Related News