సాకర్ సామ్రాట్

Updated By ManamTue, 07/17/2018 - 01:03
image

నెలరోజులకు పైగా యావత్ ప్రపంచాన్ని ఆవహించిన సాకర్ ఫీవర్ ప్రపంచ కప్‌ను  ఫ్రాన్స్  కైవసం చేసుకోవడంతో ముగిసింది. 1998 ఫిఫా చాంపియన్‌గా నిలిచిన ఫ్రాన్స్ రెండు దశాబ్దాల తర్వాత 2018లో మళ్ళీ సాకర్ సామ్రాట్‌గా అవ తరించింది. ఈసారి రష్యాలో జూన్ 14 నుంచి జూలై 15 వరకు జరిగిన ఫిఫా (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్) 2018 ప్రపంచ కప్‌లో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. సాకర్‌లో అగ్రగామిగా కొనసాగుతూ వచ్చిన లాటిన్ (దక్షిణ) అమెరికా దేశాలేవీ ఈసారి సెమీ ఫైనల్స్ దాకా కూడా రాలేకపో గా, యూరప్ దేశాలు అద్భుతంగా రాణించాయి. ఫిఫా పుట్టిల్లు అయిన ఫ్రాన్స్ కు, 1992లో ఫిఫా సభ్యురాలుగా చేరి, సాకర్‌లో పసికూన దిగ్గజాలతో పోరాడి నెగ్గుకొచ్చిన క్రొయేషియాకు మధ్య ఫైనల్స్ అత్యంత వినోదభరితంగా, మహా ఉత్కంఠభరితంగా సాగింది. సొంతగడ్డ మీద 1998 ఫిఫా సెమీఫైనల్స్‌లో మొట్ట మొదటసారి సాకర్ ప్రపంచకప్ పోటీల్లో పాల్గొన్న క్రొయేషియాను ఓడించి తర్వా త 2018 ఫైనల్స్‌లో మళ్ళీ తలపడిన ఫ్రాన్స్ ప్రపంచ విజేతగా నిలిచింది.
 

image


బంతి ఎక్కువ సేపు క్రొయేషియా చేతిలో ఉన్నా, చివరికి 4-2తో విజయం ఫ్రాన్స్‌నే వరించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే తడబడుతూ వచ్చిన క్రొయేషియా ఆట గాళ్ళు అనవసరపు తప్పిదాలకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ ప్రపంచ కప్ ఫైనల్స్‌లోనే అత్యధికంగా ఆరు గోల్స్ నమోదు అయ్యాయి. గత నాలుగు ప్రపంచకప్‌ల్లోనూ (2002-14) ఫైనల్స్‌లో ఇన్ని గోల్స్ నమోదు కాకపోవడం ఒక రికార్డు. 1966లో అదనపు సమయం తర్వాత పశ్చిమ జర్మనీని ఇంగ్లాండ్ 4-2 తోను, 60 ఏళ్ళ క్రితం స్వీడన్‌ను బ్రెజిల్ 5-7 స్కోర్‌తో ఓడించిన తర్వాత కాలంలో జరిగిన ఫిఫా పోటీల్లో అతిపెద్ద స్కోరు మళ్ళీ ఈసారి నమోదు కావడం విశేషం.

ఫుట్‌బాల్‌లో శైలి కంటే వ్యవహారిక సత్తావాదం (ప్రాగ్మటిజం) విజయాన్ని చేకూరుస్తుందనడం కద్దు. ఆధునిక ఫుట్‌బాల్‌లో ఇది నిజమేననిపిస్తోంది. సంప్ర దాయ ప్రతిపక్షాలను చిత్తు చేసేందుకు ఫుట్‌బాల్ టీంలు విభిన్నమైన శైలిని ప్రయ త్నించవలసి వస్తోంది. శక్తిమంతమైన అభిమానులు, మీడియా ప్రచారం, కోలా హలంతో ప్రతిఘాతుకంగా పోరాడే ఫ్రెంచ్ టీంతో తలపడడం అంతమాత్రంగా శిక్షణగల క్రొయేషియా టీంలకు అసాధ్యం. క్రొయేషియా ఆట శైలికి అడగడుగునా చెక్ పెడుతూ ఫ్రెంచ్ టీం ఆట సాగింది. ఆట ప్రారంభం నుంచి ఫ్రాన్స్ దూకుడు గా ఆడటంతో క్రొయేషియా ఒత్తిడిలో ఆ చిత్తయి ఫ్రాన్స్‌కు తొలి గోల్‌ను అందిం చింది.

క్రొయేషియా ఫార్వర్డ్ ప్లేయర్ సెల్ఫ్ గోల్ చేయడంతో ఫ్రాన్స్ ఖాతాలో తొలిగోల్ నమోదైంది. అనంతరం క్రొయేషియా ఫార్వర్డ్ ప్లేయర్ పెరిసిచ్ 28వ ని మిషంలో గోల్ చేసి 1-1ని సాధించాడు. ఆట 38వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ రూపంలో వచ్చిన అవకాశాన్ని ఫ్రాన్స్ సరిగా ఉపయోగించుకోగలిగింది. ద్వితీ యార్థంలో ధాటిగా ఆడిన ఫ్రాన్స్, క్రొయేషియా డిఫెన్స్ వలయాన్ని ఛేదించు కుంటూ గోల్ పోస్ట్‌లపై దాడి చేసింది. 59వ నిమిషంలో ఒకటి, 65వ నిమిషంలో మరొకటి ఫ్రాన్స్ విజయవంతంగా గోల్స్ చేయగలిగింది. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు విజృంభించినప్పటికీ, ఫ్రాన్స్ దూకుడుకు అడ్డుకట్టవేస్తూ 69వ నిమిషంలో క్రొయే షియా గోల్‌చేసి ఓటమి అంతరాన్ని తగ్గించుకోగలిగింది. ఆట ముగిసేదాకా ఎవ రూ గోల్ చేయలేకపోవడంతో ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచింది. క్రొయేషియా ఆట గాళ్ళ స్ఫూర్తి సాకర్ ప్రపంచ కప్ పోటీలన్నిటిలో ఏనాడూ చెదరకపోవడమే కాక, ప్రత్యర్థులపై నిరంతరాయంగా ఆటలో ఒత్తిడి పెంచడం ద్వారా ఫైనల్స్‌కు చేరుకో గలిగింది. అయితే ప్రత్యర్థుల శైలిని అనుక్షణం గుర్తిస్తూ, దానికి తగినట్లుగా వేగం గా ఆట తీరును మార్చుకునే అనువర్తన యోగ్యత కలిగి ఉండడం వలన ఫ్రాన్స్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది.

ఇండియా ఇప్పటివరకూ ప్రపంచకప్‌లో ఆడనేలేదు. మయన్మార్, ఇండోనేసి యా, ఫిలిప్పైన్స్ దేశాలు బ్రెజిల్ ప్రపంచ కప్ అర్హత పోటీ నుంచి విరమించు కోవడం వల్ల 1950లో భారత్‌కు ఆ అవకాశం దక్కింది. అయితే చివరి నిమి షంలో బ్రెజిల్‌కు ఫుట్‌బాల్ టీంను పంపించేందుకు ఖర్చు ఎక్కువవుతుందని టో ర్నమెంట్‌కు హాజరు కాకుండా ఇండియా విరమించుకోవడం విడ్డూరం. మరొక కారణమేమంటే బ్రెజిల్ టోర్నమెంట్‌లో షూలు వేసుకోకుండా ఉత్త కాళ్ళతో ఆడేం దుకు భారత టీంను ఫిఫా అంగీకరించకపోవడమే కాకుండా, ఫుట్‌బాల్ ప్రపంచ కప్ కంటే ఒలింపిక్స్‌లో ఆడడమే ప్రతిష్టాత్మకమని ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడ రేషన్ భావించడం. 1954 నుంచి 1982 దాకా ఫిఫా అర్హత పోటీల్లో భారత జట్టు పాల్గొనలేదు. ఆ తర్వాత పాల్గొన్నప్పటికీ క్వాలిఫై కాలేదు.

 1948 లండన్ ఒలిం పిక్స్‌లో, 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో, 1956లో మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో భారత్ పాల్గొనింది. రోవర్స్ కప్, డ్యూరాండ్ కప్, నిజాం గోల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక కప్‌లు మనదేశంలో ఫుట్‌బాల్ ఆటకు ప్రసిద్ధి. రహీంలీగ్, డివిజన్ లీగ్ అని హైద రాబాద్‌లో ఫుట్‌బాల్ పోటీలు జరిగేవి. కానీ తెలుగు రాష్ట్రాలు ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించి ప్రోత్సహించేందుకు సుముఖంగా లేకపోవడం దురదృష్టకరం. కామన్ వెల్త్ దేశాల్లో అత్యంత ప్రాచుర్యం ఉన్న క్రికెట్‌తోపాటు ప్రపంచమంతా ఆసక్తి చూపించే ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నాలుగేళ్ళకొకసారి జరిగే ఫిఫా టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు దేశ యువతను ప్రోత్సహించి, కనీసం 2022లో ఖతర్‌లో జరగబోయే పోటీలలో కనీసం అర్హత సంపాదించేందుకైనా భారత్ కృషిచేయాలి. 

English Title
సాకర్ సామ్రాట్
Related News