ఉక్రెయిన్‌లో విక్రమ్, కీర్తి డ్యూయెట్

Updated By ManamWed, 07/18/2018 - 09:51
Vikram, keerthy

Vikram, keerthy విక్రమ్, కీర్తి సురేశ్ జంటగా హరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సామి స్వ్కేర్’. సెట్స్‌పైకి వెళ్లినప్పటి నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిన ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. చివరి షెడ్యూల్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఉక్రెయిన్‌కు వెళ్లారు. అక్కడ విక్రమ్, కీర్తిలపై ఓ పాటను చిత్రీకరించనున్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఆ తరువాత మిగిలిన పనులను పూర్తి చేసుకొని త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. 2003లో ఘన విజయం సాధించిన ‘సామి’ సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శిబు తమీన్ నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ మూవీకి సంబంధించిన మొదటి పాట ఆ మధ్యన విడుదల కాగా.. నేడు మరో పాట రిలీజ్ అవ్వనుంది.

English Title
Saamy Square team off to Ukraine
Related News