‘శైలజా రెడ్డి అల్లుడు’ మొదటి సింగిల్ విడుదల

Updated By ManamFri, 08/10/2018 - 11:00
Sailajareddy Alludu

Sailajareddy Alluduనాగచైతన్య హీరోగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదలైంది. బేబి అనూ బేబి అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్ అనూ ఇమ్మాన్యుల్‌ను పడగొట్టేందుకు నాగచైతన్య ట్రై చేస్తుంటాడు. కృష్ణకాంత్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించగా.. గోపి సుందర్ సంగీతం అందించాడు. అనుదీప్ దేవ్ పాటను ఆలపించారు. ఇక ఈ చిత్రం ఆగష్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు.

English Title
Sailaja Reddy Alludu first song released
Related News