‘శైలజారెడ్డి అల్లుడు’ టీజర్ ఎప్పుడంటే..!

Updated By ManamTue, 07/31/2018 - 15:15
SRA

SRAనాగచైతన్య హీరోగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆగష్టు 1వ తేది ఉదయం 7.10గంటలకు టీజర్‌ విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగచైతన్య సరసన అనూ ఇమ్మాన్యుల్ నటించగా.. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించాడు. ఆగష్టు 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Sailaja Reddy Alludu teaser release date
Related News