ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

Updated By ManamTue, 08/07/2018 - 11:21
Sailaja Reddy Alludu

Sailaja Reddy Alluduనాగచైతన్య, అను ఇమ్మాన్యుల్ జంటగా నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర మొదటి సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘అను బేబి’ అంటూ సాగే మొదటి పాట ఆగష్టు 10వ తేదిన ఉదయం 10గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించాడు.

English Title
Sailaja Reddy First Single out on August 10th
Related News