వాయిదా పడ్డ ‘శైలజారెడ్డి అల్లుడు’

Updated By ManamTue, 08/21/2018 - 09:08
SailajaReddy Alludu

నాగ చైతన్య హీరోగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ చిత్ర విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపిన నాగచైతన్య.. వాయిదా పడుతున్నందుకు క్షమాపణలు చెప్పాడు.

కేరళలో ఉన్న దారుణ పరిస్థితుల దృష్ట్యా శైలజా రెడ్డి అల్లుడు రీ-రికార్డింగ్ పూర్తి అవ్వలేదు. దీని వలన మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వాయిదా పడ్డాయి. శైలజా రెడ్డి అల్లుడు కొత్త విడుదల తేదిని త్వరలో ప్రకటిస్తాం. అనుకోకుండా సినిమాను వాయిదా వేస్తున్నందుకు మీ అందరికీ నా క్షమాపణలు. మీకు తోచినంత సహాయం కేరళ వాసులకు చేయండి. వారందరూ త్వరగా కోలుకోవాలని నను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నాగచైతన్య ట్వీట్ చేశాడు. ఇక మరోవైపు శైలజా రెడ్డి అల్లుడు వాయిదా పడటంతో ఆగష్టు 30న రానున్న నాగశౌర్య నర్తనశాలకు కలిసొచ్చే అవకాశం ఉంది.

English Title
SailajaReddy Alludu postponed
Related News