టైటిల్ మార్చిన సల్మాన్ 

Updated By ManamWed, 09/19/2018 - 11:56
Salman Khan

Love Yatriతన బావమరిది ఆయుశ్ శర్మను హీరోగా పరిచయం చేస్తూ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నిర్మించిన చిత్రం ‘లవ్ రాత్రి’. అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించినప్పటి నుంచి.. దానిని మార్చాలంటూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చాయి. హిందువులు పవిత్రంగా జరుపుకునే దేవీ నవరాత్రులను అవమానిస్తున్నట్లుగా టైటిల్ ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో వెనక్కి తగ్గిన సల్మాన్ టైటిల్‌ను మార్చాడు. ‘లవ్ రాత్రి’ని ‘లవ్ యాత్రి’గా మారుస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశాడు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశాడు సల్మాన్ ఖాన్. కాగా తొమ్మిది రోజులు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో హీరో హీరోయిన్ మధ్య ప్రేమ ఎలా చిగురించింది..? ఆ తరువాత వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనే కాన్సెఫ్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయుశ్ జోడీగా హుస్సేన్ నటించింది. అభిరాజ్ మీనావాలా దర్శకత్వం వహించాడు.

English Title
Salman changed title of Loveratri
Related News