బిగ్‌సి బ్రాండ్‌కి సమంత ప్రచారం

Updated By ManamFri, 08/17/2018 - 06:26
samantha

samanthaహైదరాబాద్: కొత్త రూపు సంతరించుకున్న బిగ్ సి బ్రాండ్ లోగోను గురువారం నాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. బిగ్ సి బ్రాండ్ గత 16 ఏళ్ళ ప్రయాణంలో ఉన్నతమైన ఎత్తుకు ఎదిగింది. పొందికగా నేటి స్మార్ట్ ఫోన్ల వలే ఆకర్షణీయంగా కనిపించేలా  ఈ కొత్త లోగో రూపొందించారు. అమ్మకాలు, సేవల ప్రమాణాలలో పూర్వపు నాణ్యత, స్థిరత్వమే కొనసాగుతాయని తెలియజేయడానికి సంకేతంగా బ్రాండ్ రంగులలో మార్పు తీసుకురాలేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పాత కాలానికి చెందిన చిహ్నంలో  కొత్త చిహ్నం మూలాలు పొందుపరచడం గమనించవలసిన విశేషమన్నారు.  బిగ్ సి దృష్టిలో కస్టమరే ఆరాధ్య దైవమని బిగ్‌ సి స్థాపకుడు ఎం. బాలు చౌదరి అన్నారు. మొదట్లో రూ. 15 కోట్లుగా ఉన్న సంస్థ ఆదాయం ప్రస్తుతం రూ. 1500 కోట్లకు చేరినట్లు ఆయన తెలిపారు. బిగ్ సి బ్రాండ్‌కి ప్రకటన కర్తగా సమంత అక్కినేని వ్యవహరించనున్నారని ఆయన వెల్లడించారు. ఈ సెప్టెంబర్‌లో తమిళ నాడు మా ర్కెట్‌లో ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కస్టమర్లకు గొప్ప ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. కొన్ని మొబైల్స్‌పై ఉచితంగా బీమా రక్షణ కల్పించడం వాటిలో ఒకటి. ‘‘బిగ్ సితో అనుబంధం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ సంస్థ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’’ అని సమంత అన్నారు. ఈ కార్యక్రమంలో బిగ్ సి డైరెక్టర్లు వై. స్వప్న, జి. బాలాజి రెడ్డి, కైలాస్ లఖ్యాని, ఆర్. గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సికి 225కి పైగా దుకాణాలున్నాయి. 

English Title
samantha campaign for Big c brand
Related News