చైతూ కోసం మనసు మార్చుకున్న సమంత

Updated By ManamFri, 08/24/2018 - 10:30
Chaithu, Samantha

Chaithu, Samanthaఓ వైపు చైతన్య, సమంత దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే కెరీర్ పరంగా ఈ ఇద్దరు మొదటిసారి పోటీ పడాల్సి వచ్చింది. కానీ ఈ విషయంలో భర్త కోసం సమంత మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా మారుతి శైలజారెడ్డి అల్లుడు చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం మామూలుగా ఆగష్టు 31న విడుదల అవ్వాల్సి ఉంది. అయితే రీ రికార్డింగ్‌లో ఆలస్యం అవ్వడం వలన వచ్చే నెల 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

ఇక మరోవైపు సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యూటర్న్’ చిత్రాన్ని అదే రోజున విడుదల చేయాలని ఎప్పుడో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాను వాయిదా వేయడం లేక ముందే విడుదల చేయడం చేయాలని సమంత భావిస్తుందట. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి విడుదల తేదిని 27వ తేదిన ప్రకటిస్తామని తాజాగా ప్రకటించింది సమంత. దీంతో చై కోసం సామ్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జీవితంలోనే కాకుండా కెరీర్ పరంగా కూడా ఈ ఇద్దరి అండర్‌స్టాడింగ్ అందరినీ మెప్పిస్తోంది.

English Title
Samantha changed her mind for Chaitanya 
Related News