సమతూక నిర్ణయాలు అవసరం  

Updated By ManamTue, 07/17/2018 - 01:03
editorial (573)

imageప్రభుత్వ పునరుజ్జీవనం గురించి ఆలోచించే ముందు ఆలస్యాల గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే పేస్ మోడల్‌ను కూడా పరిగణన లోకి తీసుకోవాల్సి ఉంటుంది. వినూత్నమైన, అమలు చేయదగిన నిర్ణయాన్ని సత్వరం తీసుకోవాలంటే, ముందు ఒక్కొటొక్కటిగా ఫలితాలను ముందుగా బేరీజు వేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఫలితాన్ని కూలంకషంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇంతకూ పేస్ మోడల్ అనేది నాలుగు లక్షణాలతో కూడుకుని ఉంటుంది. ఇందులో మొదటిది ప్రక్రి యను ప్రారంభించడం (దీన్ని ‘పి’గా వ్యవహ రిస్తారు), రెండవది విశ్లేషణ (ఏ), మూడవది సంభా షణ (సి), నాలుగవది నిర్ణయంగా అమలు చేయడం (ఈ). ప్రక్రియను ప్రారంభించడంలో భాగంగా ఆ అంశానికి సంబంధించి, ఆ సమస్యకు సంబంధించి అవసరమైన వస్తుసామగ్రిని, పూర్తి సమాచారాన్ని సంపూర్ణంగా సేకరించడం జరు గుతుంది. ఇందుకు ఓ సమగ్రమైన నోట్‌ను తయారు చేయాల్సి ఉం టుంది. సమస్యను, ఫలితాన్ని లేదా లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అంతేకాదు, ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకుని ఉండాలి. 

మరోవిధంగా చెప్పాలంటే, దీని ప్రధానోద్దేశం పాల్ ఆపిల్‌బై చెప్పినట్టు ‘పూర్తిగా శాస్త్రీయంగా, సాంకే తికంగా, సరైన నిర్ణయం‘ తీసుకోవడం. ఓ సమస్యను గనుక ఈ విధంగా ఆలోచించి పరిష్కరించగలిగిన పక్షంలో, విశ్లేషణ పద్ధతిని ప్రయోగించాల్సి ఉంటుం ది. ఈ విశ్లేషణ నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా ఉండాలి. ఇది మొత్తం ప్రక్రియని ఆసాంతం అధ్యయ నం చేస్తుంది. ప్రక్రియ వేగంగా రూపుదిద్దుకుని అమలు చేయడానికి కూడా ఇది తోడ్పడుతుంది. అ యితే ఇక్కడో సమస్య ఉంది. సమాచారంగానీ, వస్తు సామగ్రిగానీ చాలినంత అందుబాటులో లేని పక్షం లో, విశ్లేషణ కూడా అసంపూర్తిగానూ, అసమగ్రంగానే ఉంటుంది. ఇక అధికారులకు ఏం చేయాలో పాలుపో ని పరిస్థితి ఏర్పడుతుంది. వారికి అన్ని కోణాల నుం చి ఆలోచించడం ప్రారంభిస్తారు. 

అన్ని కోణాల నుంచి ఆలోచించడమంటే, ‘అమ లు చేయడానికి ఉపక్రమించే ముందు సమస్య పూర్వా పరాలను, దాని ఫలితాలను బేరీజు వేయడం’. అంతే తప్ప ‘స్తబ్దుగా ఉండిపోయి, నిశ్చలమైపోయి, బూజుప ట్టిన నిబంధనలను అమలు చేయడం కాదు’. సంస్థ (సచివాలయం) వ్యవస్థీకృతంగా అందజేసిన పద్ధతు లను, ప్రక్రియలను యథాతథంగా ఉపయోగించడం వల్ల ప్రయోజనమేమీ లేదు. ఇక ఇక్కడ విశ్లేషణ అం టే ప్రశ్నించడం, పూర్వాపరాలను విచారించడం. అని శ్చిత పరిస్థితి, అస్థిరత్వం, విలువలకు అంటిపెట్టుకుని లేకపోవడం వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ధైర్యంగా ముందుకుపోయి సకాలంలో సరైన నిర్ణయం తీసుకో గలిగి ఉండాలి. లక్ష్యాలను చేరుకోవాలంటే, ఒక్కోసా రి ఫైళ్లను తిప్పి పంపాలి. ఒక్కోసారి తిరగ రాయాల్సి ఉంటుంది. 

సునిశిత పరిశీలన అవసరం
అనిశ్చిత పరిస్థితి, విలువ సంబంధమైన సంక్షో భాల్లో నిర్ణయాలను నిలిపివేసి, ఆ తర్వాత వాటిని పరిగణనలోకి తీసుకుని పరిశీలించాల్సి ఉంటుంది. రకరకాల ప్రత్యామ్నాయాలను, పరిష్కార మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. దీన్ని ట్రయల్ బలూన్స్‌ను ఎగరేయడం అంటారు. కొన్నిసార్లు అనిశ్చిత పరిస్థితి ఏర్పడినప్పుడు, అవి స్వల్పకాలిక నిర్ణయం అయిన ప్పుడు, అంటే దాని సమయం మించిపోవడమో, ని ధులు ఖర్చయిపోవడమో, అది పనికిరాదని తేలిపోవ డమో జరిగినప్పుడు, అటువంటి ప్రతిపాదనలను బు ట్టదాఖలు చేయాల్సి ఉంటుంది. ఇదివరకటి నిర్ణయా నికి, ఇప్పుడు అమలు చేయాల్సిన అంశానికి మధ్య ఉన్న సారూప్యాలను పరిశీలించగలిగితే, మెల్లగా నిర్ణ యాలు తీసు కోవడమో, సత్వర నిర్ణయాలు తీసుకోవడమో తేలిపోతుంది. 

నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించిన ఈ రెండు అంశాల మధ్య సారూప్యాలు ఉండే పక్షంలో, విశ్లేషణ అవసరమవుతుంది. ప్రక్రియతో పెద్దగా అవ సరముండదు. సారూప్యాలు పాక్షికంగానే ఉన్న పక్షం లో, ఈ రెండు ప్రతిపాదనలు ఒకేవిధంగా ఉండడా నికి గల కారణాలను పరిశీలించాలి. ఇటువంటి సమ యంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ సారూ ప్యానికి విలువను జోడించినట్టవుతుంది. ఇదివరకటి నిర్ణయాల విలువ కూడా పెరుగుతుంది. ప్రశ్నించడం, పూర్వాపరాలను పరిశీలించడం అనే వాటి అవసరం, అవశ్యంని పరిశీలించాలన్న పక్షంలో కొంత రాజకీయ నేపథ్యం కూడా వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. 

అంతేకాదు, ఇతర విభాగాలు, శాఖలతో, ఇతర ఏజెన్సీలతో సంప్రదించాల్సిన అవసరాన్ని సమన్వయ స్థాయిలు నిర్ధారిస్తాయి. ముఖ్యంగా సమాచారం పూర్తి స్థాయిలో లేనప్పుడో, వస్తు సామగ్రి అసంపూర్తిగా ఉన్నప్పుడో, నైపుణ్యం లోపించినప్పుడో, పూర్వాపరా లు లభ్యం కానప్పుడో ఈ సంప్రదింపులు అత్యవసర మవుతాయి. సంప్రదింపులంటే పరస్పర సహకారం కూడా కావచ్చు. శాస్త్రీయ దృక్పథంతో గనుక ప్రయ త్నిస్తే కొన్ని ఆనవాయితీ సమస్యలను తేలికగా పరిష్క రించుకోవచ్చు. అయితే, ఫైల్ నిర్వహణలో మాత్రం అధికారులు చాలావరకు నిష్పక్షపాతంగా వ్యవహరిం చాల్సి ఉంటుంది. అదే వారిని లక్ష్యాలకు చేరుస్తుంది. ఊహించని సమస్యలను ఎదుర్కొనే పరిస్థితుల్లోనే అధికారుల తీర్పు ఎట్లా ఉంటుందనేది పరిశీలించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఈ సంప్రదింపుల్లో విభిన్న అ భిప్రాయాలు వినవస్తాయి. వీటిని సమన్వయం చేసు కోవడం కత్తి మీద సామే అవుతుంది. 

చివరగా, అమలు చేయదగిన నిర్ణయాలు తీసు కోవాలంటే, మొత్తం అంశాన్ని కూలంకషంగా బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ముందుగా సమ స్యను నిర్వచించుకోవాల్సి ఉంటుంది. పరిష్కారాన్ని రూపొందించుకోవాలి. పరిష్కారాన్ని కూడా అన్ని కో ణాల నుంచి పరిశీలించాలి. సమస్యను నిర్దిష్టంగా అర్థం చేసుకున్నప్పుడే పరిష్కారాన్ని కూడా పటిష్టంగా అర్థంచేసుకుని, అమలు చేయగలుగుతారు. ప్రతి సమ స్యా దేనికదే భిన్నంగా, ప్రత్యేకంగా, విశిష్టంగా ఉం టుంది. వెనుకటి సమస్యకూ, ఇప్పటి సమస్యకూ సారూప్యాలు ఉన్నప్పటికీ, ఒక్కోసారి సమస్య ప్రత్యేక లక్షణాలతో అధికారుల ముందు నిలబడుతుంది. అత్యంత ప్రాధాన్యమున్న కోణమేదో, కొత్త సమస్యకు కలుస్తుంది. అందువల్ల సమస్య కొత్తకోణాలను, సమ స్యలోని కొత్త అంశాలను అన్ని వైపుల నుంచి పరిశీలించడం ప్రధాన బాధ్యత అవుతుంది. 

అనూహ్య సమస్యలతో అవస్థలు
అంతేకాదు, ఊహించని, ఆశించని సమస్యలేవో హఠాత్తుగా ముందుకు వస్తుంటాయి. ఉద్దేశపూర్వకం గా, అనూహ్యంగా ఈ సమస్య ఎదురు కావచ్చు కూ డా. ఉదాహరణకు, ఖర్చులు తగ్గించుకోవడానికి, సామర్థ్యం పెంచుకోవడానికి ఎలక్ట్రానిక్ పాలనను ప్రోత్సహించడం జరుగుతోంది. ఈ కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన కార్మికులు ఏదో ఒక సందర్భంలో పనిచేయనప్పుడు మొత్తం పాలన స్తంభించిపోతుంది. అటువంటి సమయంలోనే అధికారుల సమయస్ఫూ ర్తికి పరీక్ష ఎదురవుతుంది. ఇక పరిష్కారాన్ని అభివృద్ధి చేయడంలో శాస్త్ర సాంకేతిక ప్రక్రియలను, మార్గాలను కూడా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ప్రత్యామ్నా యాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. వాటి ప్రభా వాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తు త పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఇవన్నీ అమలు కావడం అనేది కొద్దిగా కష్ట సాధ్యమే అవుతుంది. అధికారులు ఒక్కోసారి ఈ సాంకేతిక, శాస్త్రీయ పరిష్కార మార్గాల నుంచి దూరం కావాల్సి న పరిస్థితులు తలెత్తుతుంటాయి. తాను ఆలోచించా ల్సిన పరిస్థితులకు కూడా దూరం కావాల్సి వస్తుంది. అందుకు కారణం రాజకీయ పరిస్థితులకు కూడా తల వంచడమే. అధికారులు ఒక్కోసారి లౌక్యంగా వ్యవహ రించక తప్పదు. 

పరిష్కారాన్ని మదింపు చేయాలంటే, అది లక్ష్యా న్ని చేరుకోగలుగుతుందా, దాని మార్గం సరైనదేనా, ఇది సరైన పరిష్కారమేనా, సమస్య పరిష్కారమైందా అని కూడా యోచించాలి. కారణం, లక్ష్యమైనా, పరి ష్కారమైనా నిలకడగా ఉండకపోవచ్చు. పరిష్కారమ నేది కొందరు విజేతలను, పరాజితులను సృష్టిస్తుంది. ఆ వ్యక్తులైనా, వర్గాలైనా, సంస్థలైనా, ఆ నిర్ణయాలు, పరిష్కారాల మంచి చెడులను తమస్థాయిలో విశ్లే షించడం సహజ పరిణామమే. అందువల్ల, పరాజి తుల కోణాన్ని కూడా సానుభూతిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు పారదర్శకత, బాహాటత్వం, విస్తృత సంప్రదింపులు జరిపే నిర్ణయా లు తీసుకోవడం వల్ల ఆ నిర్ణయాలు అమలులో మరింత సక్రమంగా ఉంటాయి.

image


(రచయిత కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి. ప్రత్యక్షంగా సమీక్షలు నిర్వహించిన వ్యక్తి. అభిప్రాయాలు వ్యక్తిగతం)

Tags
English Title
సమతూక నిర్ణయాలు అవసరం  
Related News