పీహెచ్‌డీ ప్రవేశాలకు ఒకే విధానం 

Updated By ManamThu, 08/09/2018 - 04:31
Governor Narasimhan
  • బయోమెట్రిక్‌తో విద్యలో నాణ్యత.. కామన్ అకాడమిక్ క్యాలెండర్ పాటించాలి

  • యూనివర్సిటీల పనితీరుపై గవర్నర్ సంతృప్తి.. కాలేజీల్లో మహిళల భద్రతకు చర్యలు

  • వీసీల కాన్ఫరెన్స్‌లో గవర్నర్ నరసింహన్.. భేషుగ్గా పనిచేస్తున్నారని కడియంకు కితాబు

Governor Narasimhanహైదరాబాద్: పీహెచ్‌డీ అడ్మిషన్ల విషయంలో గందర గోళం లేకుండా యూజీసీ నిబం ధనలను పాటించాలని, పరిశోధక కోర్సును నిర్ణీత కాలంలో పూర్తి చేసేలా ఉపకులపతులు చూడాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. విశ్వ విద్యాలయాల గతేడాది పనితీరుపై బుధవారం బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 14 యూనివర్సిటీల ఉపకు లపతులు, రిజిస్ట్రార్లు, అధికారులతో గవర్నర్ సమావే శమయ్యారు. అక్టోబర్‌లో గవర్నర్ నేతృత్వంలో నిర్వ హించిన సమావేశంలో చెప్పిన వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాదికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను అడిగి తెలుసుకుని.. విశ్వవి ద్యాలయాలను పటిష్టం చేసేందుకు వీసీలకు దిశానిర్ధేశ నం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు, పరీక్ష లు, ఫలితాలు ఒకే విధానంలో జరిగేందుకు వీలుగా కామన్ క్యాలెండర్‌ను అమలు చేయాలన్నారు. యూని వర్సిటీలు, కాలేజీ విద్యలో నాణ్యతను పెంచేందుకు బయోమెట్రిక్‌ను కచ్చితంగా ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన కొత్త కోర్సుల ను అధ్యయనం చేసి ఏర్పాటు చేయాలని, అవసరం లేని కోర్సులను తీసేయాలని చెప్పారు. యూని వర్సిటీలు, కాలేజీల్లో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వీసీలకు సూచించారు. ఉన్నత విద్యను పటిష్ట పరిచేందుకు డిప్యూటీ సీఎం కడియం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని, దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయని శ్రీహరిని గవర్నర్ కొనియాడారు. స్వతహాగా ఆయన అధ్యాపకుడని, ఏవైనా కథలు చెబితే.. ఆయన వెంటనే పట్టేస్తారని తెలిపారు.

English Title
The same approach to PhD entrance
Related News