ఈ నెల 29న ‘శంకర’

Updated By ManamTue, 06/19/2018 - 07:10
Shambho-shankara

Shambho-shankaraఅలీ, సునీల్, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి ఇలా చాలా మంది కమెడియన్స్ హీరోలుగా కూడా సక్సెస్‌ను అందుకున్నవారే. ఇప్పుడు అదే కోవలో షకలక శంకర్.. హీరో శంకర్‌గా నటించిన చిత్రం ‘శంభో శంకర’. శ్రీధర్‌ను దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆర్. ఆర్. పిక్చర్స్‌పై , ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో వై. రమణారెడ్డి, సురేష్ కొండేటి నిర్మిస్తోన్న చిత్రమిది. ఈ నెల 29న విడుదలవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత రమణారెడ్డి మాట్లాడుతూ ‘‘టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పరిశ్రమలో పాజిటివ్ టాక్ వినిపించడం ఉత్సాహం నింపుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నాం’’అన్నారు. నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ ‘‘షకలక శంకర్ కథానాయకుడిగానూ నిరూపించుకునే ప్రయత్నమిది. తొలి ప్రయత్నమే పెద్ద సక్సెస్ అవుతాడన్న ధీమా ఉంది. టీజర్‌కి వచ్చిన హైప్ దృష్ట్యా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. 29న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’’అన్నారు. 

English Title
The 'Sankara'
Related News