సర్దార్ సింగ్‌కు మళ్లీ పగ్గాలు

Updated By ManamWed, 02/21/2018 - 00:44
Indian-men's-hockey-team

అజ్లాన్ షా కప్‌కు జట్టు ఎంపిక
Indian-men's-hockey-teamన్యూఢిల్లీ:
ప్రముఖ హాఫ్ బ్యాక్ ప్లేయర్ సర్దార్ సింగ్ మళ్లీ భారత హాకీ జట్టుకు నేతృత్వం వహించనున్నాడు. మార్చి 3వ తేదీన మలేసియాలోని ఇపోలో జరగనున్న సుల్తాన్ అజ్లాన్ షా కప్ టోర్నీలో సర్దార్ భారత జట్టును నడిపిస్తాడు. మార్చి 10వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో ఆరో ర్యాంక్‌లో ఉన్న భారత్‌తో పాటు ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియా, నంబర్ టూ అర్జెంటీనా, ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆతిథ్య మలేసియా జట్లు తలపడతాయి. ఈ ఏడాది ఎడతెరిపిలేని షెడ్యూల్ కారణంగా సరైన కాంబినేషన్‌ను సాధించేందుకు ఇండియన్ హాకీ సెలెక్టర్లు యువకులకు తొలి ప్రాధాన్యత ఇవ్వడంతో సర్దార్ సింగ్ కొద్ది రోజులు జట్టుకు దూరమయ్యాడు. అయితే 2020 టోక్యో ఒలింపిక్స్‌కు తాను ఆడాలనుకుంటున్నానని చెప్పిన రెండు వారాలకు సర్దార్ సింగ్ జట్టులోకి వచ్చాడు. ‘మన్‌ప్రీత్ సింగ్ దూరం కావడంతో జట్టులో సర్దార్ సింగ్ ప్రధాన ఆటగాడిగా నిలిచాడు. ఇతను చాలా అనుభవమున్న ఆటగాడు. గత రెండు టోర్నీలకు సర్దార్ దూరమయ్యాడు. తన సత్తా నిరూపించుకునేందుకు అతనికి మరో అవకాశం లభించింది’ అని కోచ్ డఎస్‌జోర్డ్ మారిజ్నే అన్నారు. 

English Title
Sardar Singh reunited again
Related News