అందరూ నిర్దోషులైతే పేలుళ్లు ఎలా జరిగాయి..?

Updated By ManamMon, 04/16/2018 - 15:22
Sarve

Sarve హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ.. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఈ కేసును కొట్టివేసింది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ స్పందించారు. అందరూ నిర్దోషులైతే మరి పేలుళ్లు ఎలా జరిగాయని, ఈ తీర్పుతో పేలుళ్లలో ఎవరున్నారో తెలియకుండా పోయిందని అన్నారు.

సాక్ష్యాధారాలను నిరూపించడంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని.. దీని వెనుక ఎవరున్నారని ఆయన నిలదీశారు. పేలుళ్ల సూత్రధారులకు శిక్షపడాల్సిందేనని సర్వే సత్యానారాయణ వ్యాఖ్యానించారు.  11 ఏళ్ల నాటి మక్కా మసీదు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులు ఐదుగురినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. నిందితులపై నేరారోపణలు నిరూపించటంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందన్న న్యాయమూర్తి.. 10 మంది నిందితుల్లో స్వామి అసీమానంద, భరత్‌, దేవెందర్‌ గుప్తా, రాజేందర్‌, లోకేశ్‌ శర్మలను నిర్దోషులుగా పేర్కొంటూ.. మిగిలినవారిపై చార్జిషీటు కొనసాగుతుందని ప్రకటించింది.

English Title
Sarve Sathyanarayana on NIA court judgement
Related News