త్వరలో ‘సత్య గ్యాంగ్’

Updated By ManamWed, 03/14/2018 - 20:56
satya gang

satya gangసాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై మహేశ్ ఖన్నా నిర్మిస్తోన్న చిత్రం ‘ సత్య గ్యాంగ్’. ఈ సినిమాలో పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా చంద్రబోస్ అనాథలపై రాసిన పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ  ‘‘ఈ సినిమాలో అనాథలపై ఓ మంచి పాట రాసే అవకాశం కలిగింది. ఇంత పాట రాసే అవకాశం ఇచ్చిన నిర్మాత మహేశ్ కన్నాగారికి, దర్శకుడు ప్రభాస్‌గారికి థాంక్స్. కీరవాణిగారు నా పాట విని ఆయన సోషల్ మీడియాలో స్పందించారు’’ అన్నారు.

నిర్మాత మహేశ్ కన్నా మాట్లాడుతూ  ‘‘చంద్రబోస్‌గారు రాసిన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా అనాథలపై సాంగ్ బావుందని అంటున్నారు. మా నాన్నగారి జ్ఞాపకార్థం కోటి యాబై లక్షల స్థలాన్ని ఉచితంగా ఇచ్చాను. ఎప్పుడో ఇచ్చిన మాటకు నాన్న కోసం కట్టుబడ్డాను. అలాగే రేపు మా సినిమా చూడండి. సినిమా బాగా లేకపోతే.. టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. అనాథలకు సంబంధించిన కథ. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో ‘సత్య గ్యాంగ్’ వంటి ఓ మంచి సినిమాతో హీరోగా పరిచయమవుతుండడం గర్వంగా ఉందని హీరో సాత్విక్ ఈశ్వర్ అన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు అక్షిత కతజ్ఞతలు చెప్పారు.

English Title
satya gang movie will be soon
Related News