అమెరికా వెళ్ళ‌నున్న 'స‌వ్య‌సాచి'

Updated By ManamTue, 01/30/2018 - 20:40
savyasachi

savyasachi'ప్రేమ‌మ్‌'తో మెమ‌ర‌బుల్ హిట్ అందుకున్నారు యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో 'స‌వ్య‌సాచి' పేరుతో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మాధ‌వ‌న్‌, భూమిక కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. కీర‌వాణి సంగీత‌మందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన‌ కీల‌క‌ షెడ్యూల్‌ని అమెరికాలో చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలిసింది. మార్చి నుంచి ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంద‌ని.. కొన్ని వారాల పాటు కొన‌సాగే ఈ భారీ షెడ్యూల్‌తో సినిమా పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. కాగా, మే నెల‌లో 'స‌వ్య‌సాచి' తెర‌పైకి రానుంది.

English Title
'savyasachi' america schedule




Related News