త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ

Updated By ManamThu, 02/15/2018 - 02:51
image
  • పది రోజుల్లో గడ్డి విత్తనాల సరఫరా

  • ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలుకు అనుమతి

  • త్వరలో సొసైటీలకు ఎన్నికలు: తలసాని

imageహైదరాబాద్: కామారెడ్డి, కొమురంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లా ల్లో లిస్ట్-ఏ లబ్ధిదారులకు గొ ర్రెల పంపిణీ పూర్తయ్యిందని, త్వరలోనే లిస్ట్-బి లబ్ధిదారుల కు గొర్రెలను పంపిణీ చేయను న్నట్టు రాష్ట్ర పాడిపరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివా స్‌యాదవ్ తెలిపారు. బుధ వారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, పశుసంవర్థక, మత్స్యశాఖల అధికారులతో ప్రభుత్వం ఆయా శాఖల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో 2 లక్షల మందికి పైగా గొర్రెలను పంపిణీ చేశామని తెలిపారు. రానున్న వేసవిలో గొర్రెలకు పశుగ్రాసం కొరత లేకుండా ఉండేందుకు 4.52 లక్షల మెట్రిక్ టన్ను గడ్డి విత్తనాలను పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. పది రోజుల్లో ఈ విత్తనాలను పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. చనిపోయిన గొర్రెల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుని పరిహారం చెల్లించే విషయాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గ్రామాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 8642 నీటి తొట్టెలు, 39,372 గొర్ల షెడ్ల నిర్మాణానికి thalasaniప్రణాళికలను రూపొందించినట్టు వివరించారు. త్వరలోనే గొర్రెల పెంపకందారులు, మత్స్యకార సొసైటీలకు ఎన్నికలను నిర్వహించనున్నట్టు మంత్రి వెల్లడించారు. 11 రిజర్వాయర్లలో ప్రయోగాత్మకంగా రొయ్యల పెంపకాన్ని చేపట్టినట్టు తెలిపారు. మార్చిలో హైదరాబాద్‌లో నిర్వహించే అక్వా ఎక్స్‌పోలో 25 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నట్టు వివరించారు. సమావేశంలో ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితాసబర్వాల్, పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకటరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English Title
The second installment of the sheep will soon be delivered
Related News