రెండో రౌండ్‌లో సింధు, శ్రీకాంత్

Updated By ManamWed, 09/12/2018 - 00:36
sindhu
  • ప్రణయ్ కూడా.. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్

sindhuటోక్యో: హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధు చెమటోడ్చగా.. కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ సునాయాస విజయాలతో జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు మంగళవారమిక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో 21-17, 7-21, 21-13తో అన్ సీడెడ్ స్థానిక షట్లర్ సయక టకహషిపై పోరాడి గెలిచింది. తదుపరి మ్యాచ్‌లో చైనాకు చెందిన ఫాంగ్జీ గావోతో ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ 21-18, 21-17తో ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత జోనాథాన్ క్రిస్టీని చిత్తు చేశాడు. మరో మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-13, 21-15తో చైనాకు చెందిన యుజియాంగ్ హ్వాంగ్‌పై నెగ్గాడు. అయితే మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 18-21, 22-20, 10-21తో కొరియాకు చెందిన లీ డాంగ్ చేతిలో ఓటమిపాలై ఇంటిముఖం పట్టాడు. కాగా మిక్స్‌డ్ డబుల్స్‌లో రాంకీ రెడ్డి, పొన్నప్ప జోడీ 13-21, 17-21తో చైనాకు చెందిన యిల్యు వాంగ్, డాంగ్‌పింగ్ హ్వాంగ్ జంట చేతిలో, పురుషుల డబుల్స్‌లో చోప్రా, రెడ్డి ద్వయం 9-21, 16-21తో మాథ్యూ ఫాగర్టీ, ఇసాబెల్ ఝంగ్ జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు. 

Tags
English Title
In the second round, Sindhu, Sindhu
Related News