చైనాలో  'దంగ‌ల్' కంటే మిన్న‌గా..

Updated By ManamSat, 01/20/2018 - 17:25
secret

secret superstarబాలీవుడ్ న‌టుడు అమీర్ ఖాన్ నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే.. కొత్త‌దనం కోరుకునే ప్రేక్ష‌కుడికి పండ‌గే. కొత్త‌ద‌నం అందిస్తూనే.. వ్యాపారం ప‌రంగానూ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టిస్తుంటాయి అమీర్ సినిమాలు. ఆయ‌న రెండేళ్ల క్రితం న‌టించిన  'దంగ‌ల్'  సినిమా అయితే.. కేవ‌లం భార‌త్‌లోనే కాకుండా చైనాలోనూ స‌రికొత్త రికార్డులు న‌మోదు చేసింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అతిథి పాత్ర‌లో మెరిసిన తాజా హిట్ మూవీ 'సీక్రెట్ సూప‌ర్‌స్టార్'ని కూడా ఈ శుక్ర‌వారం చైనాలో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి తొలి రోజే 6.79 మిలియ‌న్ డాల‌ర్ల (రూ. 43.35 కోట్లు) వ‌సూళ్ల వ‌చ్చాయి.   'దంగ‌ల్' తొలి రోజు క‌లెక్ష‌న్ల కంటే ఇవి ఎక్కువ కావ‌డం విశేషం. అంతేకాకుండా.. హాంకాంగ్‌, మచ్చు వంటి ప్రాంతాల్లో ఎక్కువ వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇదే జోరు కొన‌సాగితే... 'దంగ‌ల్' సృష్టించిన రికార్డును   'సీక్రెట్ సూప‌ర్‌స్టార్' తిర‌గరాసే అవ‌కాశ‌ముంద‌ని ట్రేడ్ పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చైనాలో రూ. 1000 కోట్లు వ‌సూలు చేసి  'దంగ‌ల్'  వ‌సూళ్ల ప‌రంగా భార‌తీయ సినిమాల‌కు స‌రికొత్త ల్యాండ్ మార్క్ సెట్ చేసింది.

English Title
'secret superstar' china collections
Related News