సెక్రెటరి

Updated By ManamSun, 07/29/2018 - 04:14
maram

imageమెక్ డొనాల్డ్ రెస్టారెంట్‌లో ఓ కార్నర్ సీట్లో కూర్చొని డైట్ కోక్ తీసుకుంటూ అసహనంగా మెయిన్ డోర్ వైపు చూస్తూ కూర్చుంది సమీర. ధీరజ్ ఎప్పుడు వస్తాడా అని చకోర పక్షిలా ఎదురుచూస్తోంది. ఆమె నిరీక్షణకు ఫుల్‌స్టాప్ పెడుతున్నట్టు గ్లాస్ డోర్‌లో నుంచి బైక్ పార్క్ చేస్తూ కనిపించాడు ధీరజ్. అతను దగ్గరకు వచ్చినా సమీర మొహం వికసించలేదు. 

image

ధీరజ్ కౌంటర్ దగ్గరకు వె ళ్లి సమీరకిష్టమయిన పనీర్ పిజ్జా, కోక్.. ట్రేలో పట్టుకొచ్చాడు. ఆమె పక్కనే కూర్చుంటూ ‘‘ఇంక అలక మానవా?..’’ చిన్నగా అడిగాడు. ‘‘ఒక్క నిమిషం నా దగ్గరకు వచ్చే ముందు నీ వేషం చూసుకొన్నావా? మనిద్దరం లవర్స్‌లా లేం. పైగా నువ్వు నన్ను ఇంటరాగేట్ చెయ్యడానికి వచ్చిన పోలీసాఫీసర్‌లా ఉన్నావు’’ రుసరుస లాడుతూ అంది సమీర.

‘‘ఓహ్! అదా.. ఆలస్యం అవుతుందని యునిఫారంతో రెస్టారెంట్‌కు వచ్చేశా’’ అంటూ ఇబ్బందిగా చేతులు నలుపుకోసాగాడు. ‘‘చాల్లే చేసిన నిర్వాకం. అసలు పోలీసుని ప్రేమించడం.. నాదే బుద్ధి తక్కువ..’’ ‘‘అదేంటి సమీరా! అలా మాట్లాడతావు. పోలీసులు మనుషులు కాదా? వాళ్లకు మనసులు ఉండవా?’’ ఎదురు ప్రశ్నించాడు ధీరజ్. 

‘‘ఎందుకుండదూ.. ఉంటుంది కాని వారి బుర్రలోను, మనసులోనూ నేరస్థుల ఆలోచనలే తిరుగుతుంటాయి. అది సరే కానీ, లేటుగా వచ్చినందుకు రోజూ ఓ కొత్త కథ చెబుతావుగా.. ఈ రోజు ఏం కథ చెప్ప బోతున్నావు?’’ కోక్ తీసుకొంటూ అడిగింది సమీర. ‘‘నీకు నవ్వులాటగా ఉంది కానీ నే చెప్పేది సిటీని వణికిస్తున్న సీరియల్ కిల్లర్ కథ..’’ ‘‘అంటే నువ్వు చెప్పేది సుగుణ, సంజనల హంతకుడి గురించా?’’ ఆసక్తిగా అడిగింది సమీర. ‘‘నీకు తెలిసింది అంతవరకే. ఈ రోజు మరో అమ్మాయి స్వాతి హత్యకు గురైంది. ఆ కేసు అటెండ్ చేసి వస్తున్నాను.’’ ‘‘ఓహ్.. సారీ ధీరజ్! విషయం తెలియక నిన్ను నొప్పించాను. ఇంతకూ ఆ సీరియల్ కిల్లర్ ఎవరంటావు?’’ అడిగింది సమీర. ‘‘అదే అంతు పట్టట్లేదు. మరో విచిత్రం.. వీళ్లంతా ఆర్.ఆర్. ఇండస్ట్రీస్ చైర్మన్ రాహుల్ రాఠీ సెక్రెటరీలే.’’ ధీరజ్ మాట పూర్తికాకుండానే ‘‘మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది.’’ అంది సమీర ఉత్సాహంగా. 

‘‘అవునా ఏంటది..?’’
‘‘హత్యకు గురైన అమ్మాయిలంతా ‘ఎస్’ అక్షరం పేరు గల అమ్మాయిలే.’’ ‘‘అవును. సుగుణ, సంజన, స్వాతి.. గుడ్  ఆబ్జర్వేషన్.’’ మెచ్చున్నాడు ధీరజ్. ఆర్.ఆర్. ఇండస్ట్రీస్ చైర్మన్ రాహుల్ రాఠీ చాంబర్‌కు చేరుకున్నాడు ఎస్సై ధీరజ్. అతడిని సాదరంగా ఆహ్వానించాడు రాఠీ. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా ‘‘స్వాతి హత్యకు సంబంధించిన వివరాల కోసం వచ్చాం.’’ అని చెప్పాడు ధీరజ్. ‘‘స్వాతి చాలా మంచి అమ్మాయి. డెడికేటెడ్‌గా పనిచేసేది. తను అర్ధంతరంగా ఎందుకిలా ఆత్మహత్య చేసుకొందో అర్థం అవట్లేదు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదు.’’ అని రాఠీ చెప్తుంటే, అతని మాటలకు అడ్డుపడుతూ ‘‘మిస్టర్ రాఠీ.. ఇది ఆత్మహత్య కాదు, హత్య.’’ అన్నాడు ధీరజ్. ‘‘హత్యా..!’’ అంటూ ఆశ్చర్యంతో ఉలిక్కి పడ్డాడు రాఠీ.

‘‘ఈ మూడు నెలల్లో మూడు హత్యలు జరిగాయి. అది కూడా ఆ ముగ్గురూ మీకు సెక్రెటరీగా పని చేసినవాళ్లే కావడం వల్ల మీ దగ్గరకు వచ్చాం.’’  ‘‘మీరన్నది నిజమే. పని ఒత్తిడిలో నేను ఆ విషయాలు గమనించనే లేదు. ముగ్గురూ మంచి అమ్మాయిలే.’’ ‘‘వాళ్లతో మీ రిలేషన్‌షిప్ ఎలా ఉండేది?’’ 

‘‘అఫ్‌కోర్స్.. నేను అందరితో క్లోజ్‌గా మూవ్ అవుతుంటాను. సెమినార్లు, కాన్ఫరెన్సులకు తీసుకెళ్లినట్టే వీకెండ్ పార్టీలకు, పిక్నిక్‌లకు తీసుకెళుతుండే వాడ్ని. ఆబ్వియస్‌గా ఖరీదైన ప్రజెంటేషన్‌లు ఇచ్చేవాడ్ని. నేనెవర్నీ బలవంత పెట్టలేదు. సంతోషంగా వస్తేనే తీసుకెళ్లేవాడ్ని..’’ రాఠీ మాట పూర్తికాక ముందే ‘‘వాళ్లను రంగుల లోకంలో విహరింపజేసి మీ మోజు తీరగానే వాళ్లను మట్టుబెట్టే వారు కదూ?’’ ధీరజ్  సూటిగా అడిగేసరికి ‘‘స్టాపిట్! అమ్మాయిలతో సరదాగా తిరిగిన మాట వాస్తవమే కాని నాకు వాళ్లను చంపాల్సిన అవసరం లేదు. అయినా మీ అనుమానం నిరాధారమైంది. వాళ్లు చనిపోయిన టైమ్‌లో నేనసలు ఇక్కడ లేను. టూర్లలో ఉన్నాను.’’ అని చెప్పాడు. దానికి సంబంధించిన సాక్ష్యాలు అతడు చూపించాడు. అవి పరిశీలించాక రాఠీ మాటలు నిజమని నిర్ధారణకు వచ్చాడు. ‘‘ఉద్యోగ ధర్మంగా అన్నీ అడగాల్సి వచ్చింది. సారీ..’’ ‘‘ఇట్సాల్ రైట్. మీ డ్యూటీ మీరు చేశారు.’’ అన్నాడు రాహుల్ రాఠీ.  ధీరజ్ తిరిగి వెళ్తూ ‘‘ప్రస్తుతం మీ దగ్గర సెక్రెటరీ పోస్ట్ ఖాళీ ఉందనుకొంటా?’’ అంటూ అడిగాడు. అవునని చెప్పాడు రాఠీ. ధీరజ్ జీప్ స్టార్ట్ చేసి, ఆలోచనలో మునిగాడు.


చట్నీస్ రెస్టారెంట్‌లో కూర్చొని ఉన్నారు ధీరజ్, సమీర. ఆ రెస్టారెంట్ అంటే సమీరకు చాలా ఇష్టం. కారణం కేవలం ఫుడ్ మాత్రమే కాదు, అక్కడ సౌండ్ పొల్యూషన్‌కు దూరంగా కర్ణపేయమైన కమ్మటి సుమధురమైన పాత తెలుగు సినిమా మాటలు మంద్ర స్వరంలో వినపడుతుంటాయి. సమీరకు ఉన్న ఆ బలహీనతను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అక్కడకు తీసుకొచ్చాడు ధీరజ్. ‘‘సమీరా! ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది.’’ ‘‘ఎందుకో..?’’ దూదిపింజల్లాంటి ఇడ్లీని తుంచుతూ అడిగింది. ‘‘చెప్పానుగా ఈ సీరియల్ కిల్లర్ కేసు నా చేతికి వచ్చిందని. ఆ కిల్లర్‌ను పట్టుకున్నామంటే ప్రమోషన్ ఖాయం.’’ ధీరజ్ కళ్లు మిల మిలా మెరవడం గమనించింది సమీర. ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ...’ పాటను తన్మయంగా వింటూ, ‘‘ఇంకేం ప్రమోషన్ కొట్టేయ్. నా మెళ్లో తాళి కట్టేయ్.’’ అంది సంబరంగా. ‘‘ఆ రెండు పనులు చెయ్యొచ్చనుకో.. కానీ అందుకు నీ సహకారం కావాలి.’’ అన్నాడు ధీరజ్ నసుగుతూ.

‘‘ఓ గ్గాడ్! కొంపతీసి నన్ను పోలీసుల్లో చేరమంటావా ఏవిటీ..?’’ ‘‘అదేం కాదు.. నువ్వు రాహుల్ రాఠీ దగ్గర సెక్రెటరీగా చేరాలి..’’ అతని మాట పూర్తి కాకుండానే ‘‘ఎందుకూ..?’’ భయంగా అడిగింది. ‘‘నువ్వు భయపడకు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. కొంచెం ధైర్యం చేశావంటే చాలు.. ఇప్పటికే కొన్ని క్లూస్ దొరికాయి. మనం హంతకుణ్ణి రెడ్ హ్యాండేడ్‌గా పట్టుకోవచ్చు. ప్లీజ్ కాదనకు.’’ బతిమాలాడు ధీరజ్. కాదనలేక పోయింది సమీర.

‘‘ఎలా ఉంది కొత్త ఉద్యోగం?’’ అడిగాడు ధీరజ్. ‘‘ప్రస్తుతానికి ఓకే. అన్నట్లు.. మా బాస్, అదే రాహుల్ రాఠీ మరో రెండు రోజుల్లో బ్యాంకాక్ వెళ్తున్నాడు. ఆ రెండు రోజులు తన ఇంటికి వెళ్లమన్నాడు.’’ ‘‘దొంగ మొహందానా.. నా మొగుడ్ని వల్లో వేసుకోవాలని చూస్తావా.. నీకు ఇదే తగిన శాస్తి.’’ అంటూ సమీర మీదికి ఒరిగి గొంతు పిసకబోయింది సుమిత్ర. అంతలో.. తలుపులు ధడాల్న తెరుచుకొని ఎస్సై ధీరజ్ ప్రత్యక్షమయ్యాడు. ‘‘రాహుల్ భార్య సుమిత్రా రాఠీతో మాట్లాడావా..?’’ ‘‘నిన్ననే తను ఫోన్‌లో మాట్లాడింది. నన్ను ఇంటికి రమ్మని ఆహ్వానించింది కూడా.’’ గర్వంగా చెప్పింది. 

కొండాపూర్‌లోని రాహుల్ రాఠీ బంగళా..
‘‘ఆవ్ సమీరా.. ఆవ్..’’ అంటూ సమీరను ఆప్యాయంగా ఆహ్వానించింది సుమిత్ర. ‘‘చెప్పండి మేడమ్.. ఏం చెయ్యమంటారు?’’ అడిగింది సమీర.

‘‘నువ్వేం చెయ్యక్కర లేదు. ఇలా కూర్చుని నీ ఆఫీసు కబుర్లు చెప్పు చాలు. యూ ఆర్ మై గెస్ట్. లంచ్ టైమ్ కాగానే నేను చేసిన స్పెషల్ లంచ్ కడుపు నిండా తినేసి ఇంటికెళ్దువు గానీ..’’ అలా కబుర్లలో ఉండగానే లంచ్ టైమ్ అయింది. సమీరను డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్లి భోజనం వడ్డించింది సుమిత్ర. ‘‘అదేంటి మేడమ్.. ఒక్కదానికే వడ్డించారు! మీరు కూడా పెట్టుకోండి’’ అంది. ‘‘లేదమ్మా.. నేను ఈ రోజు ఉపవాసం. మరేం పర్లేదు. నువ్వు హాయిగా మీ ఇంట్లో కూర్చుని భోంచేసినట్టు భోంచెయ్యి.’’ అంది సుమిత్ర. ఇంతలో సుమిత్ర తన ఫోన్ మోగడంతో ‘‘నువ్వు కానీ అమ్మా..’’ అంటూ పక్క గదిలోకి వెళ్లింది. అవతలి వాళ్లెవరో అయిదు నిమిషాలు ఆగకుండా ఫోన్‌లో మాట్లాడారు. ‘‘మీరెవరో నాకు తెలియదు. ఫోన్ పెట్టేయండి..’’ అన్నా ఆపకుండా సుమిత్రతో మాట్లాడుతూనే ఉన్నారు. సుమిత్ర విసుగ్గా ఫోన్ కట్‌చేసి వచ్చేసరికి సమీర చెయ్యి కడుక్కొంటోంది. ‘‘అరే! అప్పుడే పూర్తయిందా..’’ నొచ్చుకుంటూ అంది సుమిత్ర.

‘‘పర్లేదు మేడమ్..’’ అంటూ పక్కనున్న సోఫా మీద కూర్చుంది సమీర. ‘‘ఉండు నీకు మంచి మీఠా పాన్ తెస్తాను.’’ అంటూ పక్క గదిలోకి వెళ్లింది సుమిత్ర. ఓ నిమిషం తరువాత వచ్చిన ఆమె మొహం ఆనందంతో వెలిగిపోయింది. సమీర సోఫాలో ఒక పక్కకు ఒరిగి పోయి ఉంది. గిలగిల కొట్టుకుంటూ దాహం అన్నట్టు సైగ చేస్తోంది. సుమిత్ర మొహంలో ఓ పైశాచిక ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ‘‘దొంగ మొహందానా.. నా మొగుడ్ని వల్లో వేసుకోవాలని చూస్తావా.. నీకు ఇదే తగిన శాస్తి.’’ అంటూ సమీర మీదికి ఒరిగి గొంతు పిసకబోయింది సుమిత్ర. అంతలో.. తలుపులు ధడాల్న తెరుచుకొని ఎస్సై ధీరజ్ ప్రత్యక్షమయ్యాడు. రివాల్వర్ తీసి ‘‘హాండ్సప్..’’ అంటూ బిగ్గరగా అరిచేసరికి సుమిత్ర బిత్తరపోయింది. సోఫా మీద పడుకున్న సమీర గబుక్కున లేచింది.

‘‘ఇక నీ ఆటలు సాగవు మేడమ్ సుమిత్రా! నీ భర్తతో ఈ సెక్రెటరీలు చనువుగా తిరుగుతూ ఆయన్ని వల్లో వేసుకుంటారన్న ఈర్ష్యతో మాయమాటలు చెప్పి వాళ్లను  ఇంటికి పిలిపించుకొని నీ విషపు విందునిచ్చి చంపుతున్నావు. ఇప్పుడు కూడా అలాగే జరిగేది కానీ సమీర నా మనిషి. తను ఆ ఆహారం తినకుండా జాగ్రత్త పడింది. మా మనుషులే నీకు ఫోన్‌చేసి పక్కకు వెళ్లేలా చేశారు. నిన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికే సమీర కొంచెం నటించాల్సి వచ్చింది.’’ అన్నాడు ధీరజ్. సుమిత్ర ముఖం పాలిపోయింది. ఏం మాట్లాడడానికి వీల్లేకుండా ఆమెను అరెస్ట్ చేశాడు ధీరజ్. ‘‘థాంక్యూ సమీరా!’’ అంటూ సమీరను తన బాహువుల్లో బంధించాడు. ముగ్గురి అమాయకుల హత్యకు కారణమైన సుమిత్ర కేసు విచారణలో ఉంది. 
[email protected]

Tags
English Title
Secretary
Related News