మూడురోజులపాటు పోలీస్ కస్టడీకి జగ్గారెడ్డి

Updated By ManamTue, 09/18/2018 - 17:09
Court grants police custody of jagga reddy
Court grants police custody of jagga reddy

హైదరాబాద్ : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి సికింద్రాబాద్ కోర్టు అనుమతిచ్చింది. నకిలీ పాస్‌పోర్టు, మనుషుల రవాణా తదితర కేసులలో ఆరోపణలు ఎదుర్కుంటున్న జగ్గారెడ్డిని తమ కస్టడీకి అనుమతించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే జగ్గారెడ్డిని కస్టడీకి అనుమతించరాదని ఆయన తరఫు న్యాయవాది కూడా పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సికింద్రాబాద్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతి మంజూరు చేసింది.

కాగా 2004లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయిరెడ్డి పేర్లతో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబానికి నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి.. అమెరికాకు తీసుకెళ్లారనే అభియోగాలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

English Title
secunderabad court grants police custody of jagga reddy
Related News