‘సెలెక్ట్’ అంబాసడర్ జూనియర్ ఎన్టీఆర్

Updated By ManamSat, 07/14/2018 - 00:04
ntr

imageహైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సరికొత్త మొబైల్ రిటైల్ గొలుసుకట్టు దుకాణాల సముదాయం సెలెక్ట్‌కు నటుడు జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరించనున్నారు. కంపెనీ లోగోను శుక్రవారంనాడు హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. సెలెక్ట్‌తో కలిసి పని చేయనుండటం చాలా సంతోషంగా ఉందని ఎన్టీఆర్ అన్నారు. సెలెక్ట్ మొబైల్ దుకాణాలు అద్వితీయమైన కొనుగోలు అనుభూతిని అందిస్తాయని ఆయన చెప్పారు. సెలెక్ట్ మొదటి మూడు స్టోర్‌లను తిరుపతిలో ఈ ఏడాది మే 2న ప్రారంభించింది. దేశం మొత్తం మీద 500 స్టోర్‌లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. మొదటి దశలో 200 స్టోర్‌లను ప్రారంభించనున్నట్లు సెలెక్ట్ వెల్లడించింది. ఈ నెల 20న హైదరాబాద్‌లో మొత్తం 30 స్టోర్‌లను ప్రారంభించనున్నట్లు అది పేర్కొంది.  

Tags
English Title
'Select' Ambassador Junior NTR
Related News