నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. 

Updated By ManamThu, 08/30/2018 - 10:43
Stock Market, Sensex edges lower, rupee falls, US dollar

Stock Market, Sensex edges lower, rupee falls, US dollarముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి పతనం కావడంతో ఈ రోజు మార్కెట్‌పై వాటి ప్రభావం తీవ్రంగా పడింది. దాంతో ఉదయం స్టాక్ సూచీలు నష్టాలను చవిచూశాయి. ఉదయం 9.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 45 పాయింట్లు కోల్పోయి 38,678వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 11,672 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

బ్యాంకింగ్, ఐటీ, టెలికం రంగాల్లో ఎయిర్‌టెల్‌, ఐటీసీ, టాటాస్టీల్‌ షేర్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ రంగాల్లో యాక్సిక్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి వరుసగా రెండో రోజూ నష్టాలను చవిచూసింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే పతనమైన రూపాయి 23 పైసలు(0.3 శాతం)గా 70.82కు దిగజారిపోయింది. 

English Title
Sensex edges lower, rupee falls beyond 70.80 against US dollar
Related News