వారం గరిష్ఠ స్థాయిని తాకిన మార్కెట్లు

Updated By ManamMon, 03/12/2018 - 16:55
representational
  • లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ.. సెన్సెక్స్‌‌కు 611 పాయింట్లు, నిఫ్టీకి 194 పాయింట్ల లాభం

representationalముంబై: సోమవారం మార్కెట్లు జోరు మీద ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు జోరు చూపించాయి. వారం గరిష్ఠ స్థాయిని తాకాయి. సెన్సెక్స్ 611 పాయింట్లు లాభపడింది. ఇటు ఎన్ఎస్‌ఈ నిఫ్టీ కూడా లాభాల బాట పట్టింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్ఠ పడుతుందన్న సెంటిమెంటుకు అనుగుణంగా ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలు వీయడంతో బీఎస్ఈ సెన్సెక్స్ ఈ వారంలో అత్యధిక స్థాయిని తాకినట్టయింది. 611 పాయింట్లు లాభపడి 33,917.94 పాయింట్ల వదద్ద ముగిసింది. ప్రారంభం నుంచి లాభాల బాటలో పయనించిన సెన్సెక్స్.. ఒకానొక దశలో 33,962.48 పాయింట్లకు తాకినా.. ఆ తర్వాత రోజులో 33,468.16 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అయితే, ఆ తర్వాత పుంజుకుని చివరకు 610.55 పాయింట్లు (1.83 శాతం) లాభంతో 33,917.94 పాయింట్ల వద్ద ముగిసింది. మార్చి 1 నుంచి మార్కెట్లలో అత్యధిక లాభం ఇదే కావడం విశేషం. మరోవైపు నిఫ్టీ కూడా 194.55 (1.90 శాతం) లాభపడి 10,421.40 పాయింట్ల వద్ద ముగిసింది. ఇటు, ఆసియా, యూరప్ మార్కెట్లు కూడా లాభాల బాటన నడిచాయి. 

English Title
sensex, nifty surges a week high
Related News