బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్

Updated By ManamThu, 02/15/2018 - 00:10
sevalal

sevalalభరత భూమి అనేది ఒక వేద భూమి, ఒక కర్మ భూమి, ఆధ్యాత్మిక సంప్రదాయం, పురాణాలు, వేదాల ప్రకారం మహోన్నతమై హైందవ ఆధ్యాత్మిక సంప్రదా యం భారతదేశంలో ప్రసిద్ధిచెందింది. కాలి, నడకన తిరిగి హైందవధర్మ ప్రాముఖ్యత, ప్రత్యేకత లను చైతన్యపరిచిన వ్యక్తి జగద్గురు ఆదిశంకారా చార్యులు. వైష్ణవులకు, శైవులకు మధ్య రగిలిపోతున్న ఆధిపత్య పోరుకు తనదైన శైలిలో విష్ణువు, శివుడు వేర్వేరు కాదని  చాటిచెప్పిన వారు  రామానూజాచార్యులు. దేశం మారుమూల ప్రదేశా లకు సందర్శించి బోధించి హైందవ మతం గొప్ప ప్రచా కర్తగా అందరి హృద యాలలో చిరస్మరణీయుడయ్యారు. తిరుపతి, శ్రీశైలం, వేముడవాడ రాజన్న, సమస్మక్క సారలమ్మ, సప్తమాతలు (బంజారా) నిర్దేశం తెలియని బంజా రాలకు కూడ దశదిశను చూపెట్టడానికి, వారికి హైందవ ధర్మం గొప్పతనం, ప్రత్యేకంగా మాతృదేవత (భవానీ మాత) ప్రత్యేకతను బంజారాలకు సంత్ సేవాలాల్ మహరాజ్. తెలియజేశారు.‘యాదేవి సర్వ భూతేషు మాతృ రూపేణ సమ స్తితా’/నమస్తితె నమస్తితె నమస్తతేః నమా నమహః’ ఈ సమస్త జీవకోటికి మాతృరూపంగా వెలిసిన  భవానీని పూజిం చాలేగాని ఫలితం ఆశించవద్దని బంజారాలకు సంత్ సేవాలాల్ మహరాజ్ బోధించాడు. అహింస పాపమని, మత్తు, ధూమ పానం శాపమని హితవు పలికాడు. ఆనాడు రాజుల నుంచి బ్రిటిష్ కా లం వరకు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సా మాగ్రిని ఆయా ప్రాంతాలకు చేరవేస్తూ సంచార జీవ నం సాగిస్తూ ఉండేవారు. ఆ క్రమంలో బ్రిటిష్, ము స్లిం పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురైంది. దుర్భర స్థితిని తొలగించి ఆర్థిక, సాంఘిక, రాజకీయ, అలా అనేక సంస్క రణ ద్వారా మార్పులు చేసి బంజారాలను చైతన్యపరచి అభివృద్ధి బాటలో నడిపించేందుకు సంత్ సేవాలాల్ మహరాజ్ ఉద్భవించిన భగవత్ అవతా రంగా, గురుదేవుడిగా నిలిచాడు. బంజారా తండాల్లో పరిస్థితులు అస్తవ్య స్తమై సమస్యలతో  బతి కేవారు. అప్పుడు సప్తమాతలకు కలిసి బంజారా జాతిని ఒకతాటిపై తీసుకొచ్చే మహాను భావుడిని వరంగా ఇవ్వమని సాత్ భవానులను వేడుకుంటాడు.  అపుడు సాత్ భావానీలు ‘మీ కోరిక మేరకు ఒక వ్యక్తిని మీ జాతిలో బిడ్డ వరంగా ఇస్తాం. కానీ ఆ బిడ్డ తల్లిదండ్రుల వద్ద 12 సంవత్సరాలు మాత్రమే ఉండి తరువాత మా షరతు ప్రకారం మేరమ్మ భవానీకి భగతుగా (పూజారిగా) తిరిగి అప్పగించా’లని తుళ్జ భవాని చెపుతుంది. ఈ షరతుకు తండాల్లో ఎవరూ ముందుకు రారు. ధర్మిణి, భీమానాయక్ దంపతులు సంతానం లేక తపసు చేస్తుండేవారు. ఈ విషయం తెలియగానే సప్తమాతలు ధర్మిణికి ఒకరోజు కలలో కనిపించి తమ షరతును అంగీకరిస్తే సంతానాన్ని ప్రసాది స్తామని చెబుతారు. ఆ దంపతులు భవానీ విధించిన షరతును స్వీకరిం చడానికి సిద్ధమౌతారు. వారికి వరం ప్రసాదంగా జన్మించిన పుత్రుడే సేవా లాల్.

సేవాలాల్ 1739 ఫిబ్రవరి 15న అనంతపూర్ జిల్లా రాంజీనాయక్ తండాలో జన్మించాడు. ఈయ నకు సేవాలాల్ అని నామకరణం చేశారు. సేవాలాల్ పెరిగిన తరువాత కొంతకాలంలో మేరమ్మగా పిలువ బడే జగదాంబ ప్రత్యక్షమై సేవాలాల్‌ని తనకు అప్ప  జెప్పమని భీమనాయక్‌ను అడుగుతుంది. అమ్మ వారి కి ఇచ్చిన వాగ్దానం ప్రకారం సేవాలాల్ అందుకు ఒప్పుకోడు. తండాను ఇక్కట్ల పాలుచేస్తుంది. ఇదం తా సేవాలాల్ కారణంగా జరుగుతోందని తండా వాసులు ఆయనను బహిష్కరిస్తారు. ఏడు మేకలను ఏడుగురు అమ్మవారుల ముందు బలికి ఉంచుతారు. కానీ సేవాలాల్ ప్రజల మూఢనమ్మకానికి ఏకీభవించ డు. అమ్మవారికి బలే ఇష్టమైతే తాను బలైపోతానని తలను ఖండించుకొని అమ్మవారి కాళ్ల దగ్గర పడేస్తా డు. అమ్మవారు సేవాలాల్ శిరస్సును తిరిగి అతని శరీరానికి జోడించి జీవం పోస్తుంది. నిజమైన భక్తుడు సమాజానికి సేవకుడని, అయిన ఆయన మార్గంలోనే ప్రయాణించమని జగదాంబ ఆశీర్వదిస్తుంది. అప్పటి నుంచి సేవాలాల్ జగదాంబమాతనే తన మార్గదర్శకు రాలిగా, గురువుగా స్వీకరించి బంజారాల సేవలో నిమగ్నమయ్యాడు. తల్లిసద్ది కట్టిస్టే అది ఎవరికో ఇచ్చి ఆవుల వెంట అడవిలోకి పోయేవాడు. బంకమట్టితో రొట్టెలు చేసి తినేవాడు. ఆయన అద్భుతాలైపె అనేక కథనాలున్నాయి. సేవాలాల్‌కు అపకీర్తి తీసుకురావా లని జాదూగర్ వడితియా ఒక పురుషుడికి ఆడవేషం వేసి తీసుకువచ్చి సంతానం ప్రసాదించాలని కోరతాడు. సేవాలాల్ తథాస్తు అంటూ దీవిస్తాడు. నిజంగానే ఆ పురుషుడు స్త్రీగా మారిపోతాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి, తండాలలో సాంఘిక దురాచారా లను, మూఢ నమ్మకాలను, మత్తుపానియాలను రూపుమాపడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు. సేవాలాల్ మహరాజ్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశాడు. అందులో ‘పెరిఫర్’ ఒకటి ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడిలు అరికట్టడం, క్షేత్రధ ర్మాన్ని రక్షించడం మొదలైనవి ముఖ్యమైనవి. ‘పరమత సహనం నా పరమ ఆశయం’, ‘పరమత ప్రవేశం నా ప్రాణానికి శాపం’ అని ప్రబోధించాడు. తెలంగాణ ప్రభుత్వం అధికా రికంగా సంత్ సేవాలాల్ మహరాజ్‌జయంతిని నిర్వ హించడంతో పాటు కోటి రూపాయలు నిధులు మంజూరు చేసింది. అదేవిధంగా సేవాలాల్ మహ రాజ్ మార్గంలోనే తండాలో మత్తుపానీయాలు, సారాను రూపుమాపడానికి ప్రభుత్వం చర్యలు తీసు కుంది. బంజారాలకు బంజారాహిల్స్‌లో బంజారా భావనం కోసం ఎకరం స్థలాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ కేటాయించారు. 
- జి.శంకర్ నాయక్
తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం
 9908817986
(నేడు సేవాలాల్ జయంతి)

English Title
sevalal is the worship of the Banjaras
Related News