హాలీవుడ్ నటుడిపై లైంగిక వేధింపుల కేసు

Updated By ManamThu, 06/14/2018 - 15:08
sylvester

sylvester ఆటోగ్రాఫ్ కోసం వెళితే ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్, అతడి బాడీగార్డ్‌ కలిసి తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ కేసు పెట్టింది. దీనిని నమోదు చేసుకున్న లాస్‌ఏంజెల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం గురించి బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని స్టాలోన్ బెదిరించాడని, అందులో అప్పట్లో చెప్పడానికి ధైర్యం చేయలేదని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

మరోవైపు ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్టాలోన్ తరపు న్యాయవాది మార్టీ సింగర్ అన్నారు. అవి నిజం కాదని నిరూపించడానికి తమ వద్ద ఇద్దరు ప్రత్యేక సాక్ష్యులు ఉన్నారని అన్నారు. ఈ విషయంలో దాచాల్సింది ఏమీ లేదని, ఆమె పెట్టిన తప్పుడు కేసుపై స్టాలోన్ కూడా కేసు వేశారని తెలిపారు.

 

English Title
Sexual assaault case against Sylvester Stallone
Related News