మామిడిపండ్లు కొనిస్తానని తీసుకెళ్లి బాలుడిపై లైంగికదాడి

Updated By ManamThu, 05/24/2018 - 10:16
Sexual assault on four years boy in Hyderabad

Sexual assault on four years boy in Hyderabad

హైదరాబాద్‌: భాగ్యనగరంలో రోజుకు రోజుకు నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. నేరాలను నిలువరించడానికి పోలీసులు కఠిన చట్టాలు ప్రయోగిస్తున్నప్పటికీ ఫలితం లేకపోతోంది. పోలీసులకే సవాల్ విసురుతూ దుండగులు రెచ్చిపోతున్నారు. దీంతో ఏం చేయాలో ఖాకీలకే దిక్కుతోచట్లేదు.! తాజాగా హైదరాబాద్‌లోని తుకారంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ కామాంధుడు నాలుగేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేశాడు.

వివరాల్లోకెళితే.. 
మామిడిపండ్లు కొనిస్తానని మాయమాటలు చెప్పిన ఓ సైకో నాలుగేండ్ల బాలుడిని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. పాపం.. మామిడికాయలు కదా అని ఆశపడి అతడ్ని నమ్మి వెంటవెళ్లడమే బాలుడు చేసిన తప్పు!. పోలీసు వివరాల ప్రకారం.. ఈస్ట్ మారేడుపల్లి లోహియనగర్ ప్రాంతానికి చెందిన రాజు కుమారుడు సాత్విక్(4) తుకారాంగేట్‌లోని షిరిడీ సాయిబాబా హైస్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కుక్కల నాగరాజు(35) సాత్విక్ వద్దకు వచ్చి నీకు మామిడిపండ్లు కొనిస్తాను రా అని చెప్పి తీసుకెళ్లాడు. తుకారంగేట్‌ నుంచి మారేడుపల్లి పాలిటెక్నిక్ కళాశాలలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. చెట్లపొదల్లోకి తీసుకెళ్లి బట్టలు విప్పి చితకబాది అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంకుల్ అంకుల్ అని ఆ కుర్రాడు అరిచి మొత్తుకున్నా.. ఆ కామాంధుడు వదిలిపెట్లేదు!.

అప్పటికే సాత్విక్ కనపడలేదని తల్లిదండ్రులు ఊరంతా వెతికారు.. ఎక్కడా కనిపించకపోవడంతో ఏమయ్యాడో ఏమో అని తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఊర్లో నుంచి బాలుడ్ని బయటికి తీసుకెళ్లిన నాగరాజు సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి తీసుకొచ్చాడు. బాలుడు ఒంటిపై దెబ్బలు ఉండటంతో ఏమైందని అడగ్గా తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలుడి కుటుంబీకులు, బస్తీ వాసులతో కలిసి నాగరాజును పట్టుకుని చితకబాది అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ కామాంధుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

కాగా.. నాగరాజు తరుచూ చిన్నపిల్లలపై ఇలాంటి ఘటనలకే పాల్పడుతుండేవాడని బస్తీవాసులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజును పీఎస్‌కు తీసుకెళ్లి గంటలు గడుస్తున్నా ఆయనకోసం ఒక్కరంటే ఒక్కరు కుటుంబీకులు, మిత్రులు కూడా రాలేదు. దుండగుడ్ని కఠినంగా శిక్షించాలని.. అతడ్ని మళ్లీ వదిలిపెట్టకుండా సెంట్రల్ జైలుకు తరలించాలని బస్తీవాసులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే మరి.

Sexual assault on four years boy in Hyderabad

English Title
Sexual assault on four years boy in Hyderabad
Related News