తొలి రాత్రి గురించి ఎక్కువగా ఊహించుకునే అబ్బాయిల్లో...

Updated By ManamSun, 02/11/2018 - 23:23
first night

first nightశృంగార సమస్యలనేవి భాగస్వామితో రతి సలుపుతున్న సమయంలోనే తెలుస్తుంటాయి. లైంగిక సమస్యలు స్త్రీపురుషులిరువురికీ వస్తుంటాయి. కానీ కొందరు బయటకు చెప్పుకోలేక తమలో తాము మదనపడుతుంటారు. అయితే పురుషులకు ప్రధానంగా ఎదుర్కొనే లైంగిక సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంగస్తంభన సమస్య గురించి. శృంగార సమయంలో అంగం సరైన స్థాయిలో నిలబడకపోవటం లేదా గట్టి పడకపోవటాన్ని అంగస్తంభన సమస్యగా చెప్పొచ్చు. ఈ సమస్య చాలామంది మగవారికి సహజంగా ఎదురవుతుంటుంది. కొందరు మగవారు పెళ్లైన మొదటి రోజు రాత్రి ఏదో చేయాలని, మాటల్లో వర్ణించలేని సంతృప్తిని పొందాలని అనుకుని.. లేనిపోని ఉద్రేకానికి లోనవుతారు. అలాంటి వారిలో చాలామందిని ఈ అంగస్తంభన సమస్య నిరాశకు గురిచేస్తుందట. మానసిక స్థితి లేదా శారీరక లోపాల వలన ఈ సమస్య కలగవచ్చు. ఈ సమస్య ఎక్కువగా పేయ్రోయిన్ అనే వ్యాధి వల్ల కలగవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది.

కొందరు శీఘ్ర స్కలన సమస్యతో కూడా బాధపడుతుంటారు. కొందరికీ మాత్రం శృంగార సమయంలో చాలా ఆలస్యంగా స్కలనం అవుతుంది. మరికొందరికి మాత్రం వీర్యం ఉత్పత్తి బాగానే ఉన్నా లైంగిక సమయంలో ఇతర ద్రావాలు విడుదలవుతుంటాయి. మరికొందరు పురుషులు లైంగిక వాంఛలను అణచుకుని జీవిస్తుంటారు. దీనివల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఈ రకమైన సమస్యను లాస్ ఆఫ్ లిబిడో అని కూడా అంటారు. ఇలాంటి పలు రకాల లైంగిక సమస్యలు మగవారికి ఎదురవుతుంటాయి. ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే మార్గం. శృంగార సమస్యలను వైద్యుల వద్ద నిర్భయంగా చెప్పాలి. తగిన పరిష్కారాలను అన్వేషించాలి. వైద్యుల సలహాలు పాటించి తగిన చికిత్స తీసుకోవాలి.

English Title
sexual problems and solutions
Related News